TTD: లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఖండించిన టీటీడీ

తిరుమల శ్రీవారి లడ్డులు తయారు చెయ్యడానికి కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడటంతో శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తులు మండిపడుతున్నారు. తిరుమల శ్రీవారి లడ్డుల్లో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇలాంటి సమయంలో శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం వచ్చిందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తీయడానికి కొంతమంది చిల్లరగాళ్ళు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారని శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం వచ్చిందనే విషయంపై టీటీడీ యాజమాన్యం సీరియస్ అయ్యింది. తిరుమల శ్రీవారి ఆలయం గురించి, శ్రీవారి లడ్డు ప్రసాదాలు గురించి తప్పుడు ప్రచారం చేసేవారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు పరోక్షంగా హెచ్చరించారు.

TTD accused of spreading false propaganda that tobacco packet was found in Tirumala Laddu

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం ఉందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఇది తప్పుడు ప్రచారమని టీటీడీ స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు సోషల్ మీడియాలో కొందరు ఈ తప్పుడు వార్తను వైరల్ చేస్తున్నారని, ఇది భావ్యం కాదని టీటీడీ తెలిపింది. తిరుమలలోని లడ్డు ఫోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు ఎంతో నిష్టతో, ఎంతో పవిత్రతతో, భక్తిశ్రద్ధలతో లక్షలాది లడ్డు ప్రసాదం తయారు చేస్తారని టీటీడీ తెలిపింది.

లడ్డు పోటులో సీసీ కెమెరాల పర్యవేక్షణలో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు నిష్టతో లడ్డు ప్రసాదాలు తయారు చేస్తారని, ఇలాంటి పటిష్టమైన భద్రతా వ్యవస్థలో తయారవుతున్న లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం వచ్చిందని తప్పుడు ప్రచారం చేయడం తగదని, ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని టీటీడీ తెలిపింది. తిరుమల లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం ఉందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న చిల్లరగాళ్ళకి ఆ దేవుడే సరైన శిక్ష విధిస్తాడని శ్రీవారి భక్తులు అంటున్నారు.

తిరుమల శ్రీవారు అంటే గిట్టని వాళ్లు, హిందూ వ్యతిరేకులు ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, శ్రీవారి లడ్డు ప్రసాదాల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇలాంటి పేటీఎం బ్యాచ్ కు ఆ దేవుడే సరైన శిక్ష విధిస్తాడని శ్రీవారి భక్తులు అంటున్నారు. ఇంకోసారి శ్రీవారి లడ్డూ ప్రసాదాల గురించి, తిరుమల గురించి తప్పుడు ప్రచారం చేస్తే ఇలాంటి వారిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, టీటీడీ అధికారులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+