టీటీడీ అలెర్ట్: నవంబర్ 17 నుండి రెండు రోజుల పాటు తిరుమల నడక దారులు మూసివేత; రీజన్ ఇదే!!
కలియుగ వైకుంఠ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వెళ్తున్న భక్తులకు టీటీడీ అలెర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాల హెచ్చరికలు రావడంపై టిటిడి అధికారులు అప్రమత్తమయ్యారు. స్వామి వారిని దర్శించుకోవటానికి వస్తున్న భక్తుల క్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.భారీ వర్షాల నేపధ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు.
తిరుమల తిరుపతిలో భారీ వర్షాలు
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇక తిరుమల తిరుపతి లోను కుండపోతగా వర్షం కురుస్తోంది. తిరుమల కొండపై వర్షం కురుస్తూనే ఉన్న పరిస్థితి కొనసాగుతుంది. అసలే చలికాలం కావడంతో, వర్షం పడుతున్న నేపథ్యంలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు . అంతేకాదు తిరుపతి నుండి తిరుమలకు వెళ్లడానికి, కొండ పైనుండి కిందికి రావడానికి ఘాట్ రోడ్ లో వాహనదారులు కూడా వర్షం కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

భారీ వర్షాలతో అలెర్ట్ అయిన టీటీడీ అధికారులు
విపరీతంగా కురుస్తున్న వర్షాలతో తిరుమల మెట్ల మార్గంలోనూ వరదనీరు పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ క్రమంలోనే టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. బుధవారం నవంబర్ 17వ తేదీ నుండి రెండు రోజుల పాటు తిరుపతి నుంచి తిరుమలకు నడకదారులు మూసివేస్తున్నట్లుగా టిటిడి అధికారులు ప్రకటించారు. వాతావరణ శాఖ అధికారులు తిరుమల, తిరుపతికి భారీ వర్ష సూచన ఉందని వెల్లడించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టిటిడి అధికారులు చెప్పారు. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, నడకదారిలో వర్షాలతో భారీగా వరద ముంచెత్తే ప్రమాదం ఉందని వెల్లడించారు.
నడక మార్గాలను మూసివేస్తున్నట్టు నిర్ణయం
ఇంతకు ముందు కురిసిన విపరీతమైన వర్షాలకు కూడా నడకదారిలో మెట్లు పూర్తిగా మునిగిపోగా, నడకదారి మార్గంలో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నడక దారిలో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు పిట్టగోడ లపై నడుస్తూ పడరాని పాట్లు పడ్డారు. అప్పుడు నడక దారిని తాత్కాలికంగా మూసివేసిన టీటీడీ అధికారులు, ఇప్పుడు ముందే అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షాల కారణంగానే ముందస్తు నిర్ణయం తీసుకున్నట్లు అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాన్ని మూసివేస్తున్నట్లు టిటిడి అధికారులు ప్రకటించారు.
భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని గుర్తించిన టీటీడీ అధికారులు, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా భక్తుల క్షేమం కోసం ముందుగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాలినడక మార్గంలో సెలయేళ్ళు ప్రవహిస్తుండటం, చెట్లు కూలి పడిపోయే ప్రమాదం ఉండటం, కొండ చరియలు విరిగి పడటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ మేరకు నవంబర్ 17, 18 తేదీల్లో శ్రీవారి ఆలయానికి వచ్చే రెండు దారులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. టిడిపి ఈ రెండు రోజులు అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాలకు భక్తులు రావద్దని విజ్ఞప్తి చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుండటంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
-
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications