తిరుమలలో ఏడాదికి ఒక్కసారే నిర్వహించే ఉత్సవం- ముహూర్తం ఇదే

Tirumala: వరుస సెలవులు, దీపావళి పండగ సీజన్ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 63,987 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 20,902 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 2.66 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ట్రావెలర్స్ బంగళా వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లల్లో వేచివున్న భక్తులకు శ్రీవారి సేవలకు అల్పాహారం, మంచినీరు, పాలు అందజేశారు.

TTD all set to hold Kaisika Dwadasi Ashthanam in Tirumala on November 13

ఈ 13వ తేదీన కైశిక ద్వాదశి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించనుంది టీటీడీ. ఈ సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగించనున్నారు. శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులను కరుణిస్తారు. ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది.

ఉగ్ర శ్రీనివాసుడిని వేంకటతురైవార్‌, స్నపనబేరంగా కొలుస్తారు భక్తులు. సూర్యోదయానికి ముందే తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. సూర్యోదయానికి ముందే ఈ ఊరేగింపును ముగించడానికి కారణాలు లేకపోలేదు. 14వ శ‌తాబ్దంలో ఊరేగింపును నిర్వహిస్తోన్న సమయంలో సూర్య కిర‌ణాలు స్వామివారి విగ్ర‌హం మీద ప‌డ‌గానే భారీ అగ్ని ప్ర‌మాదం సంభవించింది.

అప్ప‌టి నుంచి సూర్యోద‌యానికి ముందే ఊరేగింపు నిర్వ‌హిస్తూ వస్తోన్నారు. కైశిక ద్వాదశి నాడు ఆలయ అర్చకులు తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోపల తెల్లవారుజామున 6 నుంచి ఉదయం 7: 30 గంట‌ల వరకు కైశిక ద్వాదశి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహిస్తారు. పురాణ పారాయణం చేస్తారు. దీనితో సాలకట్ల కైశిక ద్వాదశి ఉత్సవం పూర్తవుతుంది.

కైశిక ద్వాదశికి ప్రబోధనోత్సవం, ఉత్థానద్వాదశి అని కూడా పిలుస్తారు. స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొలిపే పర్వదినమే కైశిక ద్వాదశి. శ్రీమహావిష్ణువు ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు గాఢ నిద్రలోకి వెళ్తారు. కైశిక ద్వాదశినాడు ఆయనను మేల్కొల్పడం ఆనవాయితీ. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువుదీరిన తిరుమలలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ఏటేటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+