టీటీడీ ఉద్యోగుల ఆందోళన- ఆయన్ను తొలిగించాలి..!!

TTD: తిరుమలలో టీటీడీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. టీటీడీ పరిపాలనా భవనం ముందు ఉద్యోగులు బైఠాయించి నిరసన తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ను తొలిగించాల ని డిమాండ్ చేసారు. శ్రీవారి ఆలయం వద్ద ఉద్యోగి పైన నరేష్ అనుచిత ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఉద్యోగిని దూషించిన నరేష్ పైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆందోళనకు దిగారు.

ఉద్యోగుల నిరసన
టీటీడీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్‌కుమార్‌కి వ్యతిరేకంగా పరిపాలనా భవనం ముందు ఉద్యోగులు బైఠాయించి నిరసన తెలిపారు. టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్‌ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర టీటీడీ ఉద్యోగిని తిట్టిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద ఉద్యోగి పైన బోర్డు సభ్యుడు నరేశ్ కుమార్ వ్యవహరించిన తీరు పైన ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి బాలాజీ పై బూతులతో బోర్డు సభ్యుడు విరుచుకుపడటం పైన ఉద్యోగులు మండిపడుతున్నారు.

TTD Board Member Naresh Kumar for abusive behavior towards employee sparks protest in Tirumala

పెరిగిన వేధింపులు
గతంలో వరాహ స్వామి ఆలయం వద్ద ఉద్యోగి పైన మరో బోర్డు సభ్యుడు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. కొద్ది నెలలుగా టిటిడి ఉద్యోగులపై వేధింపులు ఎక్కువ అయ్యాయని
ఉద్యోగ సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో పాలకమండలి సభ్యురాలు పనబాక లక్ష్మి సూరి సూరి అనే ఉద్యోగిని బదిలీ చేశారని గుర్తు చేసారు. పడి కావలి వద్ద ఉద్యోగిని ఇబ్బందులు పెట్టార ని చెప్పుకొచ్చారు. నరేష్ కుమార్ కు టిటిడి పాలక మండలి బోర్డు సభ్యత్వం రద్దు చేయలని డిమాండ్ చేస్తున్నారు. టిటిడి ఉద్యోగులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు.

భవిష్యత్ కార్యాచరణ
అదే విధంగా ఇటీవల ఉద్యోగులను అకారణంగా బదిలీ చేసిన వారితో పాటుగా వేటు వేసిన వారిని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేసారు. తమ సమస్యల పైన అమరావతికి వెళ్లి ప్రభుత్వ పెద్ద లతో మాట్లాడుతామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. బోర్డు సభ్యుడు మహాద్వారం వైపు వచ్చిందే కాక ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించటం సరికాదని వివరించారు. టిటిడి పాలకమండలి సభ్యుడు నరేష్ కు కేటాయించిన కారు, గెస్ట్ హౌస్, వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. తమ డిమాండ్ల పైన స్పందన లేకుంటే త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+