TTD: కల్పవృక్ష వాహనంపై విహరించిన శ్రీవారు, చెన్నై గొడుగులతో పాదయాత్ర, నీరాజనం పట్టిన భక్తులు !
తిరుమల/తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

కల్పవృక్ష వాహనం ముందు గజరాజుల సందడి
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

కల్పవృక్ష వాహనం, ఐహిక ఫలప్రాప్తి
క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు.

శ్రీవారి కోసం చెన్నై గొడుగులు
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి గొడుగులను ఊరేగింపుగా శుక్రవారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ ఆర్.ఆర్.గోపాల్‌జీ ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

చెన్నై నుంచి ఊరేగింపుగా తిరుమలకు గొడుగులు
ఆలయం ముందు ఈ గొడుగులను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందించారు. నాలుగు మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లారు. గరుడసేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు.
ఈ సందర్భంగా ఆర్.ఆర్.గోపాల్‌జీ మాట్లాడుతూ ఈనెల 25న చెన్నై నుంచి 11 గొడుగుల ఊరేగింపు ప్రారంభమైందన్నారు.

17 ఏళ్ల నాటి చరిత్ర
చెన్నైలోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం తిరువళ్లూరులోని వీరరాఘవ పెరుమాళ్ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. గురువారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి 2 గొడుగులను సమర్పించినట్టు చెప్పారు. గత 17 సంవత్సరాలుగా తిరుమల శ్రీవారికి గరుడ సేవ నాడు అలంకరించడానికి శ్రీవారికి గొడుగులు సమర్పిస్తున్నామని ఆయన తెలిపారు.
-
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications