వైఎస్ జగన్ ను కలిసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సీఎంగారు మీరు కచ్చితంగా రావాలి !!
విజయవాడ/తిరుమల/కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ఏవీ, ధర్మారెడ్డి కలిశారు. ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లిగూడెంలోని సీఎం వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన వైవీ, సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు సీఎంకు అందజేశారు. ఈ సందర్బంలో సీఎం వైఎస్ జగన్ తో చాలా సేపు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.
వైఎస్ ఆర్ జిల్లా (కడప జిల్లాలోని) ఒంటిమిట్టలోని రాముడి గుడి ఎంతో ప్రసిద్ది చెందిన విషయం తెలిసిందే. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భద్రాచలం, ఒంటిమిట్ట ఆలయాల్లో ప్రభుత్వ లాంఛనాలతో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాలను ఎంతో ఘనంగా, వైభవంగా నిర్వహించేవారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత భద్రాచలంలో తెలంగాణ ప్రభుత్వం, ఒంటిమిట్టలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో సీతారాముల కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు.

మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు ఒంటిమిట్ట ఆలయంలో శ్రీరామనవమి బ్రహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో జరిగే శ్రీరామనవి బ్రహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరు అవుతారు. ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంట మధ్య శ్రీ సీతారాముల కల్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది.
కోటి ముత్యాలతో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించడానికి టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి సోమవారం తాడేపల్లిగూడెం వెళ్లారు. ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కల్యాణోత్సవాలకు హాజరుకావాలని సీఎం వైఎస్ జగన్ కు మనవి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత ఒంటిమిట్టను ఆంధ్రప్రదేశ్ భద్రాచలం అని రాముడి భక్తులు పిలుస్తుంటారు. సీతారాముల కల్యాణోత్సవాలు తిలకించడానికి ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు హాజరు అవుతుంటారు.












Click it and Unblock the Notifications