వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జోరుగా తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల బిజినెస్ .. ఆ ట్రావెల్స్ పై కేసు పెట్టిన టీటీడీ

|
Google Oneindia TeluguNews

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు టీటీడీ వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిని అదునుగా చేసుకున్న పలు ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు తిరుమల వెళ్లే భక్తులకు దర్శనం టిక్కెట్లు కూడా తామే బుక్ చేయిస్తామని భక్తుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు తెరలేపాయి. ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపటానికి టీటీడీ సిద్ధమైంది.

తిరుమల శ్రీవారి ఆలయ భద్రతకు యాంటీ డ్రోన్ సిస్టమ్ .. దేశానికి డ్రోన్ల దాడుల భయంతో అలెర్ట్ అయిన టీటీడీతిరుమల శ్రీవారి ఆలయ భద్రతకు యాంటీ డ్రోన్ సిస్టమ్ .. దేశానికి డ్రోన్ల దాడుల భయంతో అలెర్ట్ అయిన టీటీడీ

 స్వామి వారి దర్శనం , సేవా టికెట్లను ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు

స్వామి వారి దర్శనం , సేవా టికెట్లను ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు

కాదేది అక్రమ దందాకు అనర్హం అని నిరూపిస్తున్నారు కొందరు అక్రమార్కులు. ఏకంగా తిరుమల శ్రీవారి టికెట్లను ఆన్ లైన్ లో కొనుగోలు చేసి భక్తులకు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 300 రూపాయల టికెట్ ల తో పాటు, కళ్యాణోత్సవం, ఆర్జిత సేవా టికెట్లు ప్రతి నెల 20వ తేదీన, రానున్న నెల కోసం టీటీడీ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్ లో టికెట్ బుక్ చేసుకుంటే అది కన్ఫామ్ గా అవుతుందో లేదో తెలియదని, అదే తమ ద్వారా బుక్ చేస్తే తప్పకుండా అవుతుంది అని చెప్తూ కొన్ని ట్రావెల్స్ సంస్థలు స్వామి వారి భక్తుల నుండి అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నాయి.

Recommended Video

TTD Sarva Darshan టోకెన్లు 15 వేలకు కుదింపు... ఆర్జిత సేవలు వాయిదా ! Covid Guidelines || Oneindia
 చెన్నైకి చెందిన రేవతి పద్మావతి ట్రావెల్స్ సంస్థపై కేసు నమోదు చేసిన టీటీడీ

చెన్నైకి చెందిన రేవతి పద్మావతి ట్రావెల్స్ సంస్థపై కేసు నమోదు చేసిన టీటీడీ

స్వామివారి దర్శనం , సేవా టికెట్ల కోసం అధిక మొత్తంలో జరుగుతున్న వసూళ్ళపై ఫిర్యాదు కూడా వచ్చిన కారణంగా టీటీడీ చెన్నైకి చెందిన రేవతి పద్మావతి ట్రావెల్స్ సంస్థ ఈ తరహా అక్రమాలకు పాల్పడుతోందని గుర్తించి కఠిన చర్యలకు ఉపక్రమించింది. టిటిడి విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. భక్తులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని పదేపదే టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవాలనుకుంటున్న భక్తులు టిటిడి వెబ్ సైట్ ద్వారా అని ఆన్లైన్లో తమ ఆధార్ కార్డు నెంబరు ,చిరునామాతో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తోంది.

ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలపై నిఘా .. భక్తులు ఫిర్యాదు చెయ్యాలంటున్న టీటీడీ

ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలపై నిఘా .. భక్తులు ఫిర్యాదు చెయ్యాలంటున్న టీటీడీ

స్వామివారి దర్శనం టిక్కెట్లు , సేవా టికెట్లతో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరికలు జారీ చేస్తుంది. భక్తులు దళారులను ఆశ్రయించి నష్ట పోవద్దని, వారు చెప్పే మాటలు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.స్వామివారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులు, ట్రావెల్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరిచించింది. ఇలాంటి సంస్థలపై నిఘా పెట్టింది. భక్తులు ఎవరైనా ఇలాంటివి గమనిస్తే ఫిర్యాదు చెయ్యాలని పేర్కొంది టీటీడీ. ఇదే సమయంలో వచ్చే నెల స్వామివారి దర్శనం టోకెన్లు పెంచబోమని వెల్లడించింది.

English summary
It is a known fact that the Tirumala Tirupati Temple offers the facility of booking tickets through the TTD website to the devotees who come for the darshan of Sri Venkateswara Swamy. However, many private travel agencies have resorted to charging large sums of money to devotees for booking darshan tickets to Tirumala.TTD is prepared to take serious action on such people. TTD vigilence filed case on chennai revathi padmavathi travels regaurding black marketing of TTD tickets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X