TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈ సారి ప్రత్యేకంగా - కీలక నిర్ణయం..!!
Tirumala: టీటీడీ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సిద్దం అవుతోంది. సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల కోసం వచ్చే భక్తుల రద్దీని అంచనా వేసి.. తదనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటోంది. అందులో భాగంగా ముందుగా ప్రణాళికల రూపకల్పన చేస్తోంది. గరుడోత్సవం నాడు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. దీంతో, ఈ సారి బ్రహ్మోత్సవాల వేళ ప్రత్యేకంగా సేవలు అందించేందుకు టీటీడీ కీలకి నిర్ణయం తీసుకుంది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా ఇస్రో సేవలను వినియోగించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధం అయింది. గత కొన్నేళ్లుగా ముఖ్య వాహన సేవల్లో పాల్గొంటు న్న భక్తుల సంఖ్యను టీటీడీ అంచనావేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు 24వ తేదీ నుంచి బ్రహ్మో త్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే గరుడోత్సవం రోజున మాడవీధులు, బయట ఎంతమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది. దీంతో అత్యాధునిక శాటిలైట్ల ద్వారా గుర్తించి, సమాచారాన్ని తెలుసుకొనేందుకు టీటీడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. తద్వారా తగిన ఏర్పాట్లు చేయొచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తోంది.

అదే విధంగా బ్రహ్మోత్సవాల వేళ దర్శనాలు.. సేవలు.. భక్తులకు ముందస్తు సూచనల పైనా కసరత్తు చేస్తోంది. ఇక, అక్టోబర్ నెలకు సంబంధించి 22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల కోసం టీటీడీ నిర్ణయించింది. రేపు (మంగళవారం) కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్ సవం, సహస్రదీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లను రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను జూలై 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదే విధంగా అంగ ప్రదక్షి ణం టోకెన్ల కోటాను జూలై 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న ట్లు టీటీడీ ప్రకటించింది.
శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఇక, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జూలై 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిల లో గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications