తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

24తర్వాతే: మహా సంప్రోక్షణంపై టీటీడీ ఈవో, సోషల్ మీడియా విమర్శలపై అసంతృప్తి

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగనున్న మహాసంప్రోక్షణంపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంపై టీటీడీ ఈఓ అనిల్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండానే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

టీటీడీ సంచలన నిర్ణయం: 6రోజులపాటు శ్రీవారి దర్శనం నిలిపివేత, కారణమిదే! టీటీడీ సంచలన నిర్ణయం: 6రోజులపాటు శ్రీవారి దర్శనం నిలిపివేత, కారణమిదే!

మహా సంప్రోక్షణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఆరు రోజుల పాటు పూర్తిగా మూసివేయాలని తీసుకున్న నిర్ణయంపై భక్తులు తమ అభిప్రాయాలు తెలియజేయాలని అనిల్‌కుమార్‌ సింఘాల్‌ కోరారు. జులై 24న టీటీడీ బోర్డు సమావేశం ఉన్నందున అప్పటిలోగా భక్తుల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

TTD EO Anil KUmar on maha samprokshanam issue

మహా సంప్రోక్షణ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించినా ఎక్కువ సంఖ్యలో వస్తే మిగిలిన వారు ఇబ్బంది పడతారనే ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు. మహాసంప్రోక్షణ సమయంలో రోజుకు 3-4 గంటల పాటు రెండు విడతలుగా దర్శనం కల్పించాలా? అని యోచిస్తున్నట్లు తెలిపారు.

టీటీడీకి భక్తుల ప్రయోజనాలే ముఖ్యమని.. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇబ్బంది కలిగించేలా ఉంటే మార్చుకునేందుకు వెనుకాడబోమమని ఈవో తెలిపారు. భక్తుల అభిప్రాయాలను బట్టి 24న నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

English summary
TTD EO Anil KUmar responded on Maha Samprokshanam in Tirumala temple issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X