టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబంలో విషాదం - మాజీ సీజేఐ ఎన్వీ రమణ ఓదార్పు..!!
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (28) గుండెపోటుతో కన్నుమూసారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి ముంబాయిలో ఉద్యోగం చేస్తున్నారు. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. వివాహం ఖరారు కావటంతో ఆ పనుల్లో చెన్నైకి వచ్చారు. చెన్నైకి చెందిన టీటీడీ సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో నిశ్చితార్దం జరిగింది. జనవరిలో వీరి వివాహం తిరుమలలో జరిపేందుకు నిర్ణయించారు.
వివాహానికి సంబంధించి రెండు కుటుంబాలు శుభలేఖలు పంచుతున్నారు. చెన్నైలోని ఆళ్వారుపేటలో బంధువులకు ఆహ్వాన పత్రిక ఇవ్వటానికి చంద్రమౌళి కారులో వెళ్లారు. కాసేపటికే గుండెనొప్పిగా ఉందంటూ తన స్నేహితులకు చెప్పారు. వెంటనే కావేరి ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చేరే సమయానికే ఆయన తీవ్ర గుండోపోటుకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. ఎక్మో చికిత్స అందించారు. తమ వంతు ప్రయత్నాలు చేసామని వైద్యులు వెల్లడించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని సోమవారం కావేరీ ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో ప్రకటించింది.

చికిత్ప పొందుతూ కొద్ది సేపటి క్రితం చంద్రమౌళి తుది శ్వాస విడించారు. కుమారుడు గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న వెంటనే ధర్మారెడ్డి దంపతులు ఆస్పత్రికి చేరుకున్నారు. కుమారుడు కోలుకోవాలని ప్రార్దించారు. చంద్రమౌళి కోలుకుంటున్నారని శేఖర్ రెడ్డి కూడా ఆశాభావం వ్యక్తం చేసారు. కానీ, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. వివాహ నిశ్చితార్ధం జరిగి.. వివాహ పనుల్లో ఉన్న సమయంలో ఈ విధంగా జరగటంతో ధర్మారెడ్డి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణతో సహా పలువురు ప్రముఖులు ధర్మారెడ్డిని పరామర్శించారు.












Click it and Unblock the Notifications