TTD: తిరుమలలో భక్తులు ఫుల్ హ్యాపీ, అన్నప్రసాదంలో రాజీ లేదు, రోజుకు!

కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో మంచి రోజులు వస్తున్నాయని భక్తులు అంటున్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి తిరుమలలో భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించలేదని భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే టీటీడీ ఈవోగా జే. శ్యామలరావు బాధ్యతలు స్వీకరించిన తరువాత తిరుమలలో పరిస్థితులు మారుతున్నాయి.

టీటీడీలో ప్రక్షాళన మొదలైన తరువాత మొదట శ్రీవారి భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. శ్రీవారి దర్శనార్థం పెద్దఎత్తున తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ అందిస్తున్న అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో విరివిగా అన్నప్రసాదం అందిస్తున్నారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో విరివిగా భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నారు.

TTD EO is paying special attention to the distribution of Anna Prasadam in Tirumala

అయితే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదంలో నాణ్యతలేదని గత కొంతకాలంగా భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. జే. శ్యామలరావు టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అన్నప్రసాద నాణ్యతపై ఎక్కువ దృష్టి సారించారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఈవో శ్యామలరావు అన్నప్రసాదం ఎలా ఉంది అంటూ శ్రీవారి భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించారు.

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, తిరుమలలోని సుదర్శనం, రాంభగీాతో పాటు తిరుమలలోని బస్ స్టాండులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్ లు, క్యూలైన్లలో ఇప్పుడు నిరంతరం అన్నప్రసాదం వితరణ జరుగుతోంది. జే. శ్యామలరావు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నాణ్యమైన అన్నప్రసాదం అందుతోందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

TTD EO is paying special attention to the distribution of Anna Prasadam in Tirumala

తిరుమలలో శ్రీవారి భక్తులకు అన్నప్రసాదం అందించడానికి ఒక్కరోజుకు రూ. 38 లక్షలు ఖర్చు చేస్తున్నారు. సుమారు 10 నుంచి 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్నప్రసాద తయారీ యంత్రాల స్థానంలో భారీ అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. తిరుమలలో అన్నప్రసాదం విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని ఇటీవల టీటీడీ ఈవో జేశ్యామలరావు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+