ఏపీలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ గా టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది . కరోనా కట్టడి కోసం ఏపీ సర్కార్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే . అంతేకాదు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా కరోనా కట్టడికి నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ఏపీలో కరోనా కేసుల పెరుగుదల నేపధ్యంలో మళ్ళీ పునరుద్ధరించిన కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ గా టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది .

తక్షణమే కోవిడ్ కమాండ్ కంట్రోల్ విధుల్లో చేరాలని ఆదేశాలు
తక్షణమే కోవిడ్ కమాండ్ కంట్రోల్ విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది . కోవిడ్ నివారణ , వ్యాక్సినేషన్ పర్యవేక్షణ ప్రక్రియ తదితర అంశాల పర్యవేక్షణకు ఇప్పటికే ఐఏఎస్ , ఐపీఎస్ , ఐఆర్ఎస్ అధికారులను రంగంలోకి దించిన జగన్ సర్కార్ స్థానికంగా ఎక్కడికక్కడే కరోనా కట్టడికి వ్యూహాత్మకంగా పని చెయ్యాలని ఆదేశించింది .21 మంది ఐఏఎస్ , ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులతో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.

హై లెవల్ మీటింగ్ లో కరోనా కట్టడికి పలు కీలక నిర్ణయాలు
ఈ టాస్క్ ఫోర్స్ లో సీనియర్ ఐఏఎస్ అధికారులు కృష్ణబాబు, రవిచంద్ర ,మల్లికార్జున్ , శ్రీకాంత్ ,పీయూష్ కుమార్, బాబు. ఏ, విజయరామరాజు , అభిషేక్ మహంతి వంటి అధికారులకు స్థానం కల్పించింది.
రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల నేపధ్యంలో ఈ రోజు హై లెవల్ మీటింగ్ నిర్వహించిన సీఎం జగన్ ఒకటవ తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు స్కూల్స్ కు సెలవు ప్రకటించింది . 10 వ తరగతి , ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని , కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది .
Recommended Video

లాక్ డౌన్ ఆలోచన చెయ్యని జగన్ సర్కార్ .. కరోనా కట్టడికి ప్రత్యామ్నాయ వ్యూహాలు
ఏది ఏమైనా కేసుల పెరుగుదల నేపధ్యంలో అనేక రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ , లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఏపీలో కూడా లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంటారని చర్చ జరుగుతున్నా సీఎం జగన్ మాత్రం ఆ దిశగా ఆలోచన చెయ్యటం లేదు. ఇంకా కరోనా కట్టడికి లాక్ డౌన్ మినహా ప్రత్యామ్నాయ మార్గాలపైనే దృష్టి సారిస్తున్నారు జగన్ .
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications