తిరుమల విజన్ 2047.. తగ్గేదేలే అంటున్న టీటీడీ!
తిరుమల అభివృద్ధిలో సాంప్రదాయాన్ని, ఆధునికతతో సమతుల్యం చేసుకోవాల్సిన అవసరాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ఇక తిరుమలలో ప్రణాళిక బద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణ పైన దృష్టి సారించడానికి ఇటీవల తిరుమలలో జరిగిన టిటిడి బోర్డు తిరుమల విజన్ 2047 కు శ్రీకారం చుట్టింది.
తిరుమల విజన్ 2047 .. ప్రతిపాదనలకు ఆహ్వానం
స్వర్ణాంధ్ర విజన్ 2047 కి అనుగుణంగా తిరుమలలో ప్రణాళిక బద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణ పైన దృష్టి సారించడానికి వ్యూహాత్మక ప్రణాళికతో తిరుమల విజన్ 2047ను టిటిడి ప్రారంభించింది. టిటిడి లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రఖ్యాత ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల కోసం ఆర్ఎఫ్పీని విడుదల చేసింది.

తిరుమల చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మికతకు శాశ్వత వ్యూహాలు
తిరుమలలో ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక, పవిత్ర సంస్కృతిని వారసత్వాన్ని గౌరవించి ముందుచూపుతో భక్తులకు సౌకర్యాలు వసతి మెరుగుపరచాలని భావిస్తున్న టీటీడీ ఈ మేరకు శాశ్వతమైన వ్యూహాలను అమలు చేయడానికి వివిధ కన్సల్టెంట్ల నుండి ప్రతిపాదనలను ఆహ్వానిస్తుంది.
ప్రపంచంలోనే తిరుమలను రోల్ మోడల్ గా తీర్చి దిద్దే ప్రయత్నం
ఆధునిక పట్టణ ప్రణాళిక నిబంధనలను అనుసరిస్తూ తిరుమల పవిత్రతను మరింత పెంపొందించే దిశగా ఉత్తమ ప్రణాళికలు, పర్యావరణ పరిరక్షణ బాధ్యత, వారసత్వ పరిరక్షణ బాధ్యత తీసుకొని ప్రపంచంలోనే తిరుమలను రోల్ మోడల్ గా తీర్చి దిద్దేందుకు టీటీడీ ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే పట్టణ ప్రణాళికకు సంబంధించి ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణ పైన ప్రత్యేక నైపుణ్యం కలిగిన పలు ఏజెన్సీల నుండి ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది.
ఏజెన్సీలు చెయ్యాల్సింది ఇదే
తిరుమల అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయడం, ప్రస్తుత భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని జోనల్ అభివృద్ధి ప్రణాళికను సవరించడం, భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడానికి భవిష్యత్తు వ్యూహాలను రూపొందించడం వీటికి సంబంధించి వివరణాత్మకమైన డి పి ఆర్ లు తయారు చేయడం ఈ ఏజెన్సీలు చేయవలసి ఉంది.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక పవిత్రతను కాపాడటమే లక్ష్యం
మూడు వారాలలోగా ఆసక్తికర ఏజెన్సీల నుండి తమ ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా టిటిడి కోరుతోంది. తిరుమలలో రాబోవు తరాల కోసం మరింతగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక పవిత్రతను కాపాడటమే ఈ ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యంగా పని చేయనుంది టీటీడీ. అందుకే తిరుమల విజన్ 2047 పై ఫోకస్ పెట్టింది.












Click it and Unblock the Notifications