TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త: త్వరలో స్వామి వస్త్రాలు ఈ వేలం; ఎప్పుడంటే!!
తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన అనేక విశేషాలను టీటీడీ ఎప్పటికప్పుడు స్వామి భక్తులకు అందిస్తుంది. ఇప్పటికే స్వామి వారికి మార్చిలో జరిగే విశేష ఉత్సవాలను ప్రకటించిన టీటీడీ, ఇతర కార్యక్రమాల వివరాలను వెల్లడిస్తుంది. తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లు ఈ వేలం వేస్తామని ప్రకటించిన టీటీడీ తాజాగా మరో శుభవార్త చెప్పింది.
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను వేలం వేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. మార్చి 15 నుండి 22వ తేదీ వరకు స్వామివారి వస్త్రాలు ఈ - వేలం వేయనున్నట్టు పేర్కొంది. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 412 లాట్లు ఉన్నాయని వాటిని కొనుగోలు చేయాలి అనుకునే వారు టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది.

ఇందులో ఆర్ట్ సిల్క్ ధోతీలు, ఉత్తరీయాలు, టర్కీ టవళ్లు, లుంగీలు, దుపట్టాలు, శాలువలు, బెడ్ షీట్లు, నాప్ కిన్స్, హ్యాండ్ కర్చీఫ్‌లు, పంజాబి డ్రెస్ మెటీరియల్స్, జంకాళాలు, కార్పెట్లు, గొడుగులు ఉన్నాయని ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈ వేలంలో పాల్గొని కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో, టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org / www.konugolu.ap.govt.in సంప్రదించాలని టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
ఇక ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో స్వామి వారి పై భక్తితో భక్తులు హుండీ ద్వారా కానుకగా సమర్పించిన వాచీలు మరియు మొబైల్ ఫోన్లను మార్చి 13న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది.
ఇక టీటీడీ వేలం వేసేవాటిలో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్, ర్యాడో కంపెనీల వాచీలున్నాయి. ఆదేవిధంగా ఐ ఫోన్లు, వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో కంపెనీల మొబైల్ ఫోన్లు వున్నాయి. కొత్తవి, ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 23 లాట్లు, మొబైల్ ఫోన్లు 27 లాట్లు ఈ-వేలంలో ఉంచినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
-
9020mAh బ్యాటరీ, 50MP Sony కెమెరాతో Vivo T5 Pro 5G.. ఎంతంటే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!











Click it and Unblock the Notifications