తిరుమల శ్రీవారి అన్న ప్రసాద వితరణపై భక్తులకు కీలక అప్డేట్!

కలియుగ ప్రత్యక్ష దైవం, సాక్షాత్తూ సప్తగిరులపైన కొలువైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. దేశ విదేశాల నుండి లక్షలాదిగా భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఇలా వచ్చే భక్తులకు టీటీడీ అన్న ప్రసాద వితరణ చేస్తుంది. టీటీడీ నిర్వహించే అన్న ప్రసాద వితరణ కూడా భక్తుల నుండి అనేక ప్రశంసలు అందుకుంటుంది. అటువంటి అన్న ప్రసాద వితరణలో హైటెక్ హంగులను తీసుకురావాలని టీటీడీ భావిస్తుంది.

రూ. 120 కోట్ల భారీ విరాళంతో పూర్తిగా ఆటోమేటెడ్ వంటశాల

ఏపీ సీఎం చంద్రబాబు సూచనల మేరకు తిరుమలకు వచ్చే లక్షలాది భక్తుల అన్న ప్రసాదం పంపిణీ ఇకపై అధునాతన హంగులతో నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 120 కోట్ల భారీ విరాళంతో పూర్తిగా ఆటోమేటెడ్ వంటశాల, డైనింగ్ హాల్‌ను నిర్మిస్తుంది. దీంతో ఈ ప్రాజెక్ట్ భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించడంలో తోడ్పడుతుంది.

TTD good news Signs MoU with Reliance for rs 120 Crore Automated hitech Mega Kitchen in tirumala

రిలయన్స్ తో టీటీడీ అవగాహనా ఒప్పందం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల తిరుమల పర్యటనలో వంటశాలల నిర్వహణలో ఆటోమేషన్ ఆవశ్యకతను సూచించారు. దీంతో, తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి రిలయన్స్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోగా దీనికి ఆమోదం తెలిపింది. దీంతో రిలయన్స్ ఈ ఆటోమేటేడ్ అధునాతన వంటశాలను నిర్మించనుంది.

అధునాతన వంటశాల నిర్మించి టీటీడీకి ఇవ్వనున్న రిలయన్స్

సీఎం సూచనతో, టీటీడీ అధికారులు అన్న ప్రసాద కాంప్లెక్స్ దగ్గరలోని 'అల్లమ్మ తోట' గ్యాస్ ప్లాంట్ ఉన్న ప్రదేశాన్ని కొత్త వంటశాల నిర్మాణానికి అనువైనదిగా గుర్తించారు. దీని నిర్మాణంతో ప్రసాదం తయారీ, పంపిణీ ప్రక్రియ వేగంగా, నాణ్యంగా సాగుతుందని భావిస్తున్నారు. రిలయన్స్ ఈ వంటశాల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత రిలయన్స్ వంటశాలను టీటీడీ బోర్డుకు అప్పగిస్తుంది.

టీటీడీ సిబ్బందికి అవసరమైన శిక్షణ

అంతేకాదు ఈ ఆటోమేటెడ్ అత్యాధునిక వంటశాలకు సంబంధించిన నిర్వహణకు కూడా టీటీడీ సిబ్బందికి అవసరమైన శిక్షణను కూడా రిలయన్స్ ఏజెన్సీలే అందిస్తాయి. ఇది భక్తులకు మరింత మెరుగ్గా, వేగంగా, తక్కువ శ్రమతో అన్న ప్రసాద వితరణ చేయటానికి అవకాశం కల్పిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+