వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీటీడీ గుడ్ న్యూస్: ఆ రైతులకు అండగా .. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక ప్రకటన

|
Google Oneindia TeluguNews

టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులకు శుభవార్త చెప్పారు. గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లించి ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని పేర్కొన్న వై వి సుబ్బారెడ్డి జాతీయ గో మహా సమ్మేళనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం అండగా
నేల తల్లిని రక్షించడానికి జాతీయ గో మహా సమ్మేళనం నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రకటించారు.భూమి కలుషితం కాకుండా గో ఆధారిత ఉత్పత్తులనే వాడాలని పేర్కొన్నారు. గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం అండగా ఉంటుందని చెప్పిన ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారని స్పష్టం చేశారు. గో ఆధారిత సహజ వ్యవసాయం చేసిన ఉత్పత్తులను తిరుమల శ్రీవారి నైవేద్యంగా నివేదించడానికి ఉపయోగిస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు.

 TTD Good News: TTD will buy products from cow-based agri farmers; TTD Chairman YV Subbareddy

ప్రకృతి వ్యవసాయాన్ని జగన్ ప్రోత్సహిస్తున్నారన్న వైవీ సుబ్బారెడ్డి
గోవును జాతీయ జంతువుగా గుర్తించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి వెల్లడించారు. గో సంరక్షణ కోసం వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్న ఆయన, సనాతన హిందూ ధర్మ ప్రచారం చేస్తూనే సీఎం జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు గోసంరక్షణ చేస్తున్నామని వెల్లడించారు. రసాయన ఎరువులతో తయారు చేసిన దాణా తినడం వల్ల ఆవుల పాలు కూడా కలుషితం అవుతున్నాయని, ఆ పాలను తాగడం వల్ల మహిళల్లో క్యాన్సర్ పెరిగిపోతుందని అధ్యయనాల్లో తేలిందని పేర్కొన్న వై వి సుబ్బారెడ్డి, ప్రకృతి వ్యవసాయాన్ని టిటిడి ప్రోత్సహిస్తుందని, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్నది టీటీడీ ఉద్దేశమని వెల్లడించారు.

గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలతో నైవేద్యం
దేశం ఆర్థికంగా, ధార్మికంగా, ఆరోగ్యపరంగా బాగుపడాలంటే గోసంరక్షణ చేయాల్సిన అవసరం ఉందని ఆయన తేల్చి చెప్పారు. వందల సంవత్సరాల నాటి సాంప్రదాయాన్ని పునరుద్ధరించి శ్రీవారికి గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలతో నైవేద్యం సమర్పిస్తున్నాం అని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గోవులను సంరక్షించటం మనందరి కర్తవ్యం అని పేర్కొన్నారు వై వి సుబ్బారెడ్డి. జాతీయ గో మహా సమ్మేళనంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్పత్తి చేస్తున్న ఆయుర్వేద పంచగవ్య ఉత్పత్తులను, అగరబత్తులను, మహతి కళాక్షేత్రంలో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో ప్రదర్శనతో పాటుగా కొనుగోలుకు ఉంచారు.

జాతీయ గో మహా సమ్మేళనం తిరుపతిలో ... పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన రైతులు
టీటీడీ ప్రచురణలు, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన చిత్రపటాలు కూడా స్టాల్స్ లో ఉన్నాయి. మొత్తం 24 స్టాల్స్ ను ఏర్పాటు చేసిన క్రమంలో వాటిలో నాలుగు స్టాల్స్ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంది. గో మహా సమ్మేళనానికి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుండే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. వారందరికీ టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించి, శ్రీనివాస వసతి గృహం, పద్మావతి నిలయం, ఎస్వీ విశ్రాంతి భవనం గోవిందరాజస్వామి వారి సత్రాలలో వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. గో మహా సమ్మేళనంలో గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులకు టిటిడి అండగా ఉంటుందని వై వి సుబ్బారెడ్డి చేసిన ప్రకటన సహజ వ్యవసాయం చేసే రైతులు గుడ్ న్యూస్ గా భావిస్తున్నారు.

English summary
TTD Chairman YV Subbareddy said good news to the farmers who are doing Cow based farming. YV Subbareddy made key remarks at the inaugural function of the National Go Maha Sammelan, stating that we will buy products cow-based agriculture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X