వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Tirumala: భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇక స్వామి దర్శనం..!!

|
Google Oneindia TeluguNews

TTD Latese Decisions: తిరుమల తిరుపతి దేవస్థానం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా సమావేశమైన పాలక మండలి భక్తులకు శ్రీవారి దర్శనంలో వెసులుబాటు కలిగిస్తూ నిర్ణయాలు ప్రకటించింది. అదే సమయంలో శ్రీవారు కొలువై ఉన్న ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు నిర్వహించాలని నిర్ణయించారు. స్వామివారికి భ‌క్తులు స‌మ‌ర్పించిన బంగారంతోనే తాప‌డం ప‌నులు పూర్తిచేస్తామ‌ని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. ఇక..వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు చేసారు. వైకుంఠ ద్వార దర్శనం పైన కీలక నిర్ణయం తీసుకున్నారు.

వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి దర్శనం..

వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి దర్శనం..


జనవరి 2 నుంచి పది రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వారం దర్శనం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలని బోర్డు నిర్ణయించింది. రోజూ ఆన్ లైన్ ద్వారా 25 వేలు, ఆఫ్ లైన్ లో 50 వేల ప్రత్యేక ప్రేవేశ దర్శనా టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు. దీంతో పాటు వీఐపీ బ్రేక్, శ్రీవాణి ట్రస్టు దాతలకు కలిపి రోజుకు 80 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. తిరుపతిలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి జనవరి 1 నుంచి 10 రోజులు పాటు ఆఫ్ లైన్ టికెట్లు ఇస్తామని వివరించారు. టోకెన్లు లేని భక్తులు తిరుమల వచ్చినా వైకుంఠ ద్వారా దర్శనం కల్పించలేమని స్పష్టం చేసారు. జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వయంగా వచ్చే వీఐపీ లకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామని ప్రకటించారు.

దర్శన సమయాల్లో మార్పు..

దర్శన సమయాల్లో మార్పు..

బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 7.30 నుంచి 8 గంటల మధ్య ప్రారంభించారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా టీటీడీ ఉద్యోగుల‌కు బ‌హుమ‌తి ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల పెంపుపై ఆల‌య ఈవో ధ‌ర్మారెడ్డి ఆధ్వ‌ర్యంలో క‌మిటీని ఏర్పాటు చేయ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 23 వ తేదీన బాలాల‌య ప‌నులు ప్రారంభిస్తామ‌ని, 6 నెల‌ల కాల వ్య‌వ‌ధిలో బాంగారు తాప‌డం ప‌నులు పూర్తి చేస్తామ‌ని టీటీడీ చైర్మ‌న్ చెప్పారు. బంగారు తాప‌డం ప‌నులు నిర్వ‌హించే స‌మ‌యంలో ఆల‌యం ద‌ర్శ‌న విధానంలో మార్పులు చేయ‌వ‌ల‌సి వ‌న్తుంద‌ని చెప్పుకొచ్చారు.నంద‌కం అతిధి గృహంలో 2.95 కోట్ల‌తో అధునాత‌న‌మైన ఫర్నీచ‌ర్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు టీటీడీ చైర్మ‌న్ తెలిపారు.
ఆలయాలకు నిధులు కేటాయింపు..

ఆలయాలకు నిధులు కేటాయింపు..

టీటీడీ పరిధిలోని ఆలయాలకు..అతిధి గృహల మరమ్మత్తులకు బోర్డు సమావేశంలో నిధులు కేటాయించారు. ఘాట్‌రోడ్ లో 9 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో క్రాష్ బ్యారియ‌ర్‌ను.. అదేవిధంగా బాలాజీ కాల‌నీలో 3 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో స్థానికుల నివాసాల‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేయాలని నిర్ణయించారు. రూ 3.8 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో ప‌ద్మావ‌తి అతిధి గృహంతో గ‌దుల‌కు మ‌ర‌మ్మ‌త్తులకు బోర్డు ఆమోదం తెలిపింది. జ‌మ్ములో ఆల‌య నిర్మాణం ప‌నుల‌కు 7 కోట్ల రూపాయ‌లు కేటాయించారు. రూ 3.3 కోట్ల వ్య‌యంతో స్విమ్స్ ఆసుప‌త్రిలో హాస్ట‌ల్ గ‌దుల ఏర్పాటు తో పాటుగా.., తిరుప‌తిలో తాత‌య్య గుంట అమ్మ‌వారి ఆల‌య అభివృద్ధి కోసం 3.7 కోట్లు కేటాయించాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది.

English summary
TTD board taken key decision for Srivari Pilgirms and temples development .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X