Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం..

Tirumala: తిరుమల శ్రీవారికి ఈ ఏడాది నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో ఇంజినీరింగ్‌ విభాగంలో ఆధ్వర్యంలో దాదాపు 15 కోట్ల రూపాయల వ్యయంతో టీటీడీ పలు అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో రూ.9.41 కోట్లు సివిల్, రూ.5.61 కోట్లతో ఎలక్ట్రికల్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగానికి సంబంధించిన పనులు ఉన్నాయి. ఈ వివరాలను టీటీడీ చీఫ్ ఇంజినీర్ స‌త్య‌నారాయ‌ణ‌ వెల్లడించారు. తిరుమల రాంబగీచా-2లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆరు నెలల ముందు నుండి ప్రణళికాబద్ధంగా సివిల్‌ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కాటేజీలు, విశ్రాంతి సముదాయాలకు మరమ్మతులు చేశామని తెలిపారు. నాలుగు మాడవీధుల్లో భజన మండపాలు, పుష్కరిణికి మరమ్మతులు, గ్యాలరీల ఏర్పాటు, క్యూలైన్లు, తిరుమల రెండు ఘాట్‌ చేసినట్లు మరమత్తులు పనులు పూర్తిచేసినట్లు వివరించారు. వాహనాల పార్కింగ్‌ కోసం తిరుమల, తిరుపతిలో పార్కింగ్‌ ప్రదేశాలను అభివృద్ధి చేశామని చెప్పారు.

TTD have been taken up several development works at Tirumala

భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన స‌మాచారం అందించేందుకు 20 ప్రాంతాల‌లో హెల్ప్‌డెస్క్‌లు, పోలీస్ శాఖ‌ ఆధ్వ‌ర్యంలో 12 మే ఐ హెల్ప్ యు కౌంట‌ర్లు ఏర్పాటు చేసిన‌ట్లు సత్యనారాయణ వివరించారు. భ‌క్తుల సౌక‌ర్య‌ార్థం సైన్ బోర్డులు ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు. నిరంత‌రాయంగా మంచినీరు, విద్యుత్ స‌ర‌ఫ‌రాకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెప్పారు. మొద‌టిసారిగా డిజాస్ట‌ర్ మేనేజ్ మెంట్ కు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల వ‌స్తువులు అందుబాటులో ఉంచిన‌ట్లు ఆయన గుర్తు చేశారు.

భ‌క్తుల‌కు ఎలాంటి ఆసౌక‌ర్యం క‌లుగ‌కుండా తిరుమ‌ల‌లోని పార్కింగ్ ప్రాంతాల‌ను అభివృద్ధి చేసి, వాహ‌నాలు నిలిపేందుకు మార్కింగ్‌, ఆయా ప్రాంతాల‌కు పేర్లు, అందుకు సంబంధించిన సైన్ బోర్డులు ఏర్పాటు చేశామ‌ని సీనియర్ ఇంజినీర్ వేణుగోపాల్ అన్నారు. రెండు ఘాట్ రోడ్లలో మ‌ర‌మ‌త్తులు చేసిన‌ట్లు వివ‌రించారు.

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భ‌క్తులు నిరంత‌రాయంగా కృషి చేసిన క‌ల్యాణ క‌ట్ట క్షుర‌కుల సేవ‌లు అభినంద‌నీయ‌మ‌ని ఆ విభాగం డిప్యూటీ ఈవో వెంక‌ట‌య్య అన్నారు. భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించడానికి 1,148మంది క్షుర‌కులు మూడు షిఫ్టుల్లో సేవ‌లు అందించార‌ని చెప్పారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో తొలి ఏడు రోజుల్లో 2.11 ల‌క్ష‌ల మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారని, నాలుగో రోజున ఈ సంఖ్య గరిష్టంగా 49,088 మందికి చేరిందని వివరించారు.

మరోవైపు శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 73,275 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 21,973 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.77 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో 14 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పట్టింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+