TTD: శ్రీవారి భక్తులకు బిగ్ అప్డేట్: దర్శనం, వసతి మీ చేతిలోనే- ఇలా చేయండి..!!
Tirumala: తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. వేసవిలో పెరిగే రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా బ్రేక్ దర్శనాల వేళల్లోనూ మార్పులు చేసింది. గతంలో అమలు చేసిన సమయాలను పునరుద్దరించింది. ఇక, భక్తులకు దర్శనం, వసతితో పాటుగా సేవల విషయంలోనూ వెసులుబాటు కలిగేలా కొత్త మార్పులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
భక్తుల సేవల కోసం
తిరుమలలో భక్తులకు సేవలను సులభతరం చేసేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా వాట్సప్ సేవలను అందుబాటులోకి తేవటం ద్వారా సమాచారం మరింత సులభంగా పొందేలా నిర్ణయించింది. ప్రభుత్వం ప్రారంభించిన వాట్సప్ వినియోగం గురించి అధికారులు వెల్లడించారు. వాట్సప్ నుంచి 9552300009కి "హాయ్" అని మెసేజ్ పంపట ద్వారా మనకు కావాల్సిన ఆప్షన్ల మెనూ దర్శనమిస్తుంది. అందులో తిరుమల సమాచారం కోసం భక్తులు "టీటీడీ దేవాలయాల సేవలు"ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ వెంటనే మెనూలో కావాల్సిన సర్వీస్ ఎంచుకోవచ్చు. ఇది ప్రస్తుతం ట్రయల్ రన్‌లో ఉంది, కానీ భవిష్యత్తులో మరిన్ని సేవలు జోడించే ప్లాన్ సిద్దం అవుతోంది.

టీటీడీ సేవలు
ఈ టీటీడీ వాట్సప్ ద్వారా స్లాటెడ్ సర్వదర్శనం లైవ్ స్టేటస్: శ్రీవారి దర్శనం కోసం ఎంత టైం పడుతుందో రియల్ టైమ్‌లో తెలుసుకోవచ్చు. శ్రీ వాణి ట్రస్ట్ లైవ్ స్టేటస్: ట్రస్ట్ సంబంధిత అప్‌డేట్స్ తెలుసుకునే అవకాశం ఉంది. ముందస్తు డిపాజిట్ రిఫండ్ స్టేటస్: ఏదైనా డబ్బులు రిఫండ్ కోసం వెయిట్ చేస్తున్నావా? దాని స్టేటస్ ఇక్కడ తెలుసుకునే అవకాశం కల్పించారు. అదే విధంగా డొనేషన్స్ ఇన్ఫర్మేషన్: టీటీడీ ట్రస్ట్‌లకు విరాళాలు ఇవ్వాలనుకుంటే వివరాలు తెలుసుకునేలా రూప కల్పన చేసారు. తాజాగా భక్తుల అభిప్రాయాల కోసం టీటీడీ కొత్త వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది.
భక్తుల ఫీడ్ బ్యాక్ కోసం
భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ఓ కొత్త ఫీడ్‌బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌లను మొబైల్‌తో స్కాన్ చేస్తే వాట్సాప్‌లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. - ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు మొదలైనవి)ను ఎంచుకోవాలి. అనంతరం, అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మాట్ ను ఎంచుకోవచ్చు. సేవా ప్రమాణాన్ని ఉత్తమం, సగటు/మరింత మెరుగు దల అవసరం, లేదా బాగాలేదు గా రేట్ చేయాల్సి ఉంటుంది. భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చు లేదా వీడియోగా అప్‌లోడ్ చేయవచ్చు. భక్తుల నుండి అందిన అభిప్రాయాలను టీటీడీ యాజమాన్యం పరిగణనలోకి తీసుకుని సేవల ప్రమాణాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది.












Click it and Unblock the Notifications