TTD: టీటీడీ కీలక ప్రకటన, ఈ రెండు నెలల పాటు - భక్తులు ఇక నుంచి..!!
Tirumala: తిరుమలలో వేసవి రద్దీ కొనసాగుతోంది. ప్రతీ ఎటా వేసవి మూడు నెలలు కొండ పైన రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రద్దీ కారణంగా టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు సదుపాయాలు కల్పిస్తోంది. అదే సమయంలో దర్శనం సమయానికే క్యై లైన్లలోకి భక్తులు రావాలని టీటీడీ సూచిస్తోంది. ఇక, సాధారణ భక్తులకు సులభంగా దర్శనం కలిగించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు తాజాగా ముఖ్య సూచనలు చేస్తోంది.
సిఫారసు లేఖలు రద్దు
భక్తుల రద్దీ వేళ టీటీడీ బ్రేక్ దర్శనాల విషయంలో అనూహ్య నిర్ణయం వెల్లడించింది. తిరుమల వెంకేటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల రద్దీ తాకిడి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో వీఐపీ, సిఫారసు లేఖల పై దర్శనాలు రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంటున్నట్లు టీటీడీ బోర్డు సభ్యు డు.. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. మే, జూన్ లో రెండు నెలల పాటు కుటుంబా లతో తిరుమలకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మే 1 నుంచి జూన్ 30 వరకు వీఐపీ దర్శనాలతో పాటుగా సిఫారసు లేఖల పై సేవలు.. బ్రేక్ దర్శనాలు.. సుప్రభాతం దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రెండు నెలల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది.

కొనసాగుతున్న రద్దీ
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ప్రముఖ నటుడు నాని ఆదివారం ఉదయం సుప్రభాత సేవలో స్వామి వారిని దర్శించుకున్నారు. తన తాజా సినీమా హిట్ 23 విజయం సాధించాలని కోరుకుంటూ ఆయన శనివారం కలినడకన తిరుమల చేరుకున్నారు. ఆ రాత్రి తిరుమలలో బస చేసి ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. నానితో పాటు హిట్ 3 హీరోయిన్, చిత్ర బందం కూడా ఉన్నారు.
ప్రతి వాహనం తనిఖీ
పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్రం హెచ్చరికలతో జిల్లా పోలీసు, టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అలిపిరిలో తనిఖీలను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని, వాటిలోని సామగ్రిని, అనుమానితులను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల లగేజీలను స్కానింగ్ యంత్రాల్లో సూక్ష్మంగా పరిశీలన చేసిన అనంతరం తిరుమలకు పంపారు. తిరుమలకు వచ్చే వాహనాలను రెండో ఘాట్‌లోని లింక్‌రోడ్డుకు సమీపంలో ఆపి తనిఖీలు నిర్వహించారు. అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు జల్లెడపట్టాయి. శ్రీవారి ఆలయం పైభాగంలో, గొల్లమండపం వద్ద సాయుధ సిబ్బందిని అప్రమత్తం చేశారు. తిరుమలలోని సీసీ కెమెరాల పనితీరుపై దృష్టిసారించారు. సీసీ కెమెరాల్లో ప్రతి ఒక్కరి కదలికపైనా నిఘా ఉంచాలని కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందిని ఆదేశించారు.












Click it and Unblock the Notifications