తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. నకిలీ వెబ్ సైట్ల విషయంలో జాగ్రత్త
కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడు కొండలపైన కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఉండే వారు కోట్లలోనే ఉంటారు. దేశవ్యాప్తంగా నిత్యం లక్ష మందికి పైగా భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే శ్రీవారి దర్శనాలు, సేవలకు భక్తులు ఎక్కువ ఆన్ లైన్ మీద ఆధార పడుతున్నారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకుని దానికి తగ్గట్టు పాలన్ చేసుకుని వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు.
టీటీడీ దర్శన టోకెన్ ల బుకింగ్ విషయంలో జాగ్రత్త
కొందరు నేరుగా వచ్చి సర్వ దర్శనం లేదా స్లాటెడ్ సర్వ దర్శనం (SSD) టోకెన్లతో శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ప్రతి నెలా భక్తులు టీటీడీ విడుదల చేసే టిక్కెట్ల కోసం నిరీక్షిస్తూ ఉంటారు. ఇక శ్రీవారి దర్శన టికెట్లకు తీవ్ర డిమాండ్ ఉండటంతో, అవి క్షణాల్లోనే బుకింగ్ అవుతాయి. శ్రీవారి దర్శనాలు, వసతి బుకింగ్‌ల సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.

నకిలీ వెబ్ సైట్ లతో మోసం చేస్తున్న కేటుగాళ్ళు
టీటీడీ వెబ్‌సైట్‌ను పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి కొందరు మోసగాళ్ళు భక్తులను మోసం చేస్తున్నారు. ఈ విషయాన్ని టీటీడీ గుర్తించింది. ఈ నకిలీ సైట్ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరిస్తోంది. నకిలీ వెబ్ సైట్లు భక్తుల నుండి భారీగా ఆన్ లైన్ చెల్లింపులు వసూలు చేస్తున్నాయని టీటీడీ గుర్తించింది. ఈ మేరకు భక్తులను అలెర్ట్ చేస్తుంది టీటీడీ.
కర్ణాటక ప్రవాసి సౌధ పేరుతో నకిలీ వెబ్ సైట్ కేసు నమోదు
నకిలీ సైట్ల మోసాలను అరికట్టేందుకు టీటీడీ విజిలెన్స్ విభాగం నిఘా పెంచింది. తాజాగా కేరళకు చెందిన భక్తుడు సీకే సురేష్ బాబు "కర్ణాటక ప్రవాసి సౌధ" పేరుతో నకిలీ వెబ్‌సైట్ ద్వారా తిరుమలలో గదులు ఇప్పిస్తామని నమ్మించి మోసగించబడ్డారు. సురేష్ బాబు ఫిర్యాదుతో విజిలెన్స్ అధికారులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.ఈ సైట్లు టీటీడీ లోగోలు, తిరుమల ఆలయ ఫోటోలను అనధికారికంగా వాడుకుంటున్నాయని అధికారులు తేల్చారు.
అధికారిక వెబ్ సైట్ లోనే బుక్ చేసుకోవాలి
టీటీడీ ఐటీ విభాగం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి, కాపీరైట్ చట్టం కింద బాధ్యులపై కేసులు నమోదు చేసింది. భక్తులు ఏ వెబ్ సైట్ పడితే అది నమ్మరాదని టీటీడీ పేర్కొంది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in మాత్రమే సందర్శించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అనుమానాస్పద లింకులు, దళారులను నమ్మి డబ్బు పోగొట్టుకోవద్దని, మోసపోవద్దని టీటీడీ సూచిస్తోంది. అనుమానాస్పద వెబ్‌సైట్లు, యాప్‌లు లేదా ఫోన్ కాల్స్ వస్తే వెంటనే టీటీడీ దృష్టికి తీసుకురావాలని అధికారులు కోరారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications