క్యూకాంప్లెక్సులు, కంపార్టుమెంట్లల్లో ఇకపై..
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభం అయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలి మూడు రోజుల కోసం మొత్తం 1,76,000 మంది భక్తులను ఈ- డిప్ ద్వారా ఎంపిక చేశారు.
తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వీటి పనితీరు గురించి వివరించారు. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో భక్తులు ఎక్కువ సమయం పాటు వేచివుండకుండా. వేగంగా శ్రీవారి దర్శనం చేసుకోవడంలో AI ఆధారిత కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతోందని అన్నారు.

వేచివుండే సమయాన్ని తగ్గించడానికి అవసరమైన డేటాను అందజేస్తుందని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో 17 కోట్ల రూపాయల వ్యయంతో ఏఐ ఆధారిత అత్యాధునిక పరికరాలను సమకూర్చామని ఆయన తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ దాతల సహకారంతో 25 నుంచి 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సెంటర్ ను ప్రారంభించామని గుర్తు చేశారు.
దర్శనానికి ప్రతిరోజు ఎంతమంది భక్తులు వస్తున్నారనేది దీని ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని, అలాగే వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో ఏ కంపార్టుమెంట్ లో ఎంత సమయం వాళ్లు వేచి ఉన్నారు.. ఏ సమయంలో ఎంతమంది దర్శనం చేసుకుంటున్నారనే డేటాను ఎప్పటికప్పుడు సేకరించడానికి వీలు కలుగుతోందని అన్నారు. వారికి అందుతున్న అన్నప్రసాదాలను కూడా తెలుసుకోగలమని వెంకయ్య చౌదరి చెప్పారు.
కంపార్టుమెంట్లు ఏవైనా ఖాళీగా ఉంటే వివరాలను ఈ టూల్స్ ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చని, ఎవరికి ముందుగా దర్శనం చేయించాలనేది కూడా సూచిస్తుందని పేర్కొన్నారు. ఓ కంపార్ట్ మెంట్ లో 450 మందికి మించి భక్తులు ఉంటే వెంటనే తమకు అలర్ట్ అందుతుందని అన్నారు. తక్కువగా ఉన్న చోట గ్రీన్ కనిపిస్తుందని, ఇలా కంపార్ట్మెంట్లు, క్యూలైన్లను నిర్వహించవచ్చని వెంకయ్య చౌదరి చెప్పారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ట్రాఫిక్ నియంత్రించవచ్చని వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమల అలిపిరిలో ఎన్ని వాహనాలు ఉన్నాయనేది ఇది రికార్డు చేస్తుందని, బ్లాక్ లిస్ట్‌లో ఉన్న వాహనాలేవైనా తిరుమలకు చేరుకున్నాయా, నో పార్కింగ్‌లో ఉన్న వాహనాలు ఎన్ని ఇలా ప్రతిదీ ఈ వ్యవస్థద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. క్యూకాంప్లెక్స్ 1, 2, నారాయణగిరి షెడ్లు, రింగ్ రోడ్ లోని క్యూలైన్లు, నడకమార్గాలు, అలిపిరిలో అదనంగా సుమారు 250 ఆధునిక కెమెరాలను ఏర్పాటు చేసి ఐసీసీసీకి అనుసంధానిస్తామని అన్నారు.
-
మోహన్ బాబు 'పద్మశ్రీ' వెనక్కు..తెర వెనుక, అనూహ్య పరిణామాలు..!! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications