జగన్ ప్రభుత్వానికి రూ.100 కోట్ల ఆఫర్?

తిరుపతిలో ఉన్న తాత్కాలిక కలెక్టర్ కార్యాలయ భవనాన్ని పూర్తిస్థాయిలో ఇచ్చేస్తామని, అందుకు రూ.100 కోట్లు ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనిపై జిల్లా అధికారులు నిర్ణయం తీసుకోలేదు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల, తిరుపతిలోని అతిథి గృహాలు సరిపోకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుచానూరుకు సమీపంలోని జాతీయ రహదారి పక్కన 5.35 ఎకరాల విస్తీర్ణంలో 2013లో భారీ భవన నిర్మాణాన్ని నిర్మించింది. 'శ్రీపద్మావతి నిలయం'గా ఈ భవనానికి పేరు పెట్టారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఇది సౌకర్యంగా ఉంటుందని టీటీడీ భావించింది.

రూ.68 కోట్లతో ప్రణాళిక వేయగా, చివరకు రూ.75 కోట్లు వెచ్చించారు. 8 అంతస్తుల్లో 200 గదులతో పాటు డార్మెటరీలు నిర్మించారు. ఈ భవన నిర్మాణం పూర్తయిన వెంటనే కొవిడ్ విజృంభించడంతో అప్పట్లో కొవిడ్‌ వైద్య కేంద్రంగా ఉపయోగించారు. భక్తులకు అద్దెకు ఇచ్చేందుకు వీలుగా తర్వాత పర్యాటక శాఖకు అప్పగించారు. ఈలోగా రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరగడం.. కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాకు కలెక్టరేట్‌ సముదాయంగా శ్రీపద్మావతి నిలయాన్ని ఎంపిక చేయడం జరిగిపోయాయి.

 TTD Rs.100 crore offer to andhra pradesh government

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. భవన ఆకృతుల్లో మార్పులు చేయకుండా చూడాలని బాధ్యులను కోర్టు ఆదేశించింది. 'తిరుపతి కలెక్టరేట్‌'గా పేరు మార్చడానికి ముందు తాత్కాలిక కలెక్టర్ కార్యాలయం అని ఉండేది. రూ.100 కోట్లు చెల్లిస్తే భవనాన్ని ఇచ్చేందుకు సిద్ధమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తాజాగా ప్రతిపాదన పంపించడంతో దీన్ని జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ఆర్‌అండ్‌బీతో పాటు వివిధ శాఖల అధికారులు భవనాన్ని పరిశీలిస్తారు. అనంతరం ధర నిర్ణయిస్తారు. ఆ తర్వాతే బదిలీ ప్రక్రియ జరుగుతుంది. అయితే ఇంతవరకు అడుగు ముందుకు పడలేదని, ఏ నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+