మహిళలకు TTD అరుదైన అవకాశం - మీ ప్రాంతంలోనే స్వయంగా మీరే..ఇలా..!!

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు శ్రావణ పౌర్ణమి కావటంతో సాయంత్రం గరుడ వాహన సేవ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మాడ వీధుల్లో శ్రీవారి దర్శనం ఇవ్వనున్నారు. వరుస సెలవులు కావటంతో భక్తుల రద్దీ పెరిగింది. శిలా తోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతు న్నాయి. టోకెన్ లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. కాగా, టీటీడీ తాజాగా సామూహిక శ్రీమహాలక్ష్మి దీప పూజ కార్యక్రమం పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కు అవకాశం కల్పించనున్నారు.

టీటీడీ చరిత్రలో స్వామి వారి కళ్యాణోత్సవాలను వివిధ ప్రాంతాల్లో నిర్వహించటం పరిపాటి. కాగా, శ్రీమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లి సామూహికంగా శ్రీమహాలక్ష్మీ దీపోత్సవం నిర్వహించటం కొత్త కార్యక్రమం. కాగా, టీటీడీ నిర్వహిస్తున్న సామూహిక శ్రీమహాలక్ష్మీ దీప పూజ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. దీపారాధన విశిష్ఠతను చాటుతూ అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం సిద్దించాలనే సంకల్పంతో టీటీడీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జూన్ 19న తిరుపతి రామచంద్ర పుష్కరిణి వద్ద నిర్వహించిన దీపోత్సవంకు 800 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. ఆ తరువాత చంద్రగిరి కోదండరామ స్వామి ఆలయం వద్ద రెండు వేల మందికి పైగా పాల్గొనగా.. పలమనేరు లో ఏకంగా ఏడు వేల మంది మహిళలు పాల్గొన్నారు.

 సికింద్రాబాద్ నుంచి అయోధ్య, హరిద్వార్ కు కొత్త రైళ్లు ఖరారు- రూట్, ముహూర్తం..!!
సికింద్రాబాద్ నుంచి అయోధ్య, హరిద్వార్ కు కొత్త రైళ్లు ఖరారు- రూట్, ముహూర్తం..!!
ttd-to-conduct-mass-sri-mahalakshmi-deepa-puja-every-15-days-in-selected-areas-full-details-here

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ కు ప్రణాళికలు

కాగా.. ఈ దీపోత్సవంలో పాల్గొనే మహిళలకు 26 రకాల పూజా సామాగ్రితో కూడిన కిట్ ను టీటీడీ అందిస్తోంది. తాజా ప్రణాళికల్లో భాగంగా సెప్టెంబర్ 11న నెల్లూరులో పది వేల మంది మహిళలకు 30 వేలకు పైగా దీపాలు వెలిగించే విధంగా కసరత్తు చేస్తున్నారు. అదే విధంగా భవిష్యత్ లో ప్రతీ 15 రోజులకు ఒక సారి ఒక నియోజకవర్గం లేదా పట్టణం ఎంపిక చేసుకొని వేలాది మంది మహిళల తో ఈ దీపోత్సవ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించేలా టీటీడీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీని ద్వారా మహిళలకు తమ ప్రాంతాల్లోనే ఈ యజ్ఞంలో పాల్గొనే అవకాశం దక్కుతుంది. దీనికి సంబంధించి నెల్లూరు కార్యక్రమం వేదికగా టీటీడీ ప్రకటన చేసే విధంగా ఆలోచన చేస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు మహిళల నుంచి వస్తున్న స్పందనతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+