టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు-కొత్తగా ఇవే..!

ఇవాళ తిరుమల అన్నమయ్య భవనంలో సమావేశమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (టీటీడీ బోర్డు) కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీలో భక్తులకు అందించే సౌకర్యాలు, ఆహారం, అలాగే దేవస్థానాన్ని విస్తరించే ప్రయత్నాలు వంటి అంశాలపై బీఆర్ నాయుడు అధ్యక్షతన బోర్డు కొన్ని నిర్ణయాలు ప్రకటించింది. దీంతో పాటు టీటీడీలో కొత్తగా కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది.

టీటీడీలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు వీలుగా డిజిటల్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలలని పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే భక్తుల కోసం ఆహార భద్రత బోర్డు ఏర్పాటు చేయాలని మరో నిర్ణయం తీసుకుంది. తిరుమలలో తక్కువ ధరకే భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు.

ttd to establish digital corporation for feedback and food security board soon

తిరుమల అన్నప్రసాదానికి పెరిగిన డిమాండ్ కు తగినట్లు ఉద్యోగులు లేరని, కాబట్టి త్వరలో వారి నియామకాలు చేపడతామని ఈవో వెల్లడించారు. అలాగే టీటీడీ కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం కమిటీ వేసి మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. అలాగే స్విమ్స్ ఆస్పత్రికి జాతీయ హోదా కోసం కేంద్రాన్ని కోరతామన్నారు. ప్రతీ రాష్ట్రంలోనూ శ్రీవారి ఆలయం నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

మరోవైపు టీటీడీలో రెండు కొత్త సంస్థల ఏర్పాటుకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇందులో ఒకటి డిజిటల్ కార్పోరేషన్ కాగా.. మరొకటి ఆహార భద్రత బోర్డు. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు డిజిటల్ కార్పోరేషన్ పని చేయనుండగా.. భక్తులకు తిరుమలలో ఆహారం అందించే విషయంలో ఆహార భద్రత బోర్డు చర్యలు తీసుకోనుంది. తిరుపతిలోని కంచి కామకోటి సంప్రదాయ పాఠశాలకు రెండు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చేందుకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+