TTD: నేడు తిరుమలలో రెండు విశేష ఉత్సవాలు.. దర్శనానికి వెళ్ళే భక్తులకు అలెర్ట్!!
కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండలపైన కొలువైన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా విశేష సేవలు కొనసాగనున్నాయి. నేడు టిటిడి ఆధ్వర్యంలో రెండు విశేష ఉత్సవాలు జరుగుతున్నాయి. తిరుమలలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా నిన్నటి నుంచి తుంబుర తీర్థ ముక్కోటి కొనసాగుతుంది.
తుంబురతీర్థ ముక్కోటికి భక్తుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. శేషాచల అడవులలోని తుంబుర తీర్థానికి నిన్న ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు భక్తులను అనుమతించారు .ఇక నేడు కూడా తుంబుర తీర్థానికి భక్తుల రాక కొనసాగుతుంది. నేడు ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే తుంబుర తీర్థానికి భక్తులను అనుమతించనున్నారు.

నేడు కూడా విశేష సంఖ్యలో భక్తులు వస్తున్న క్రమంలో టీటీడీ వారికి మౌలిక సదుపాయాలను కల్పించడానికి, అన్నప్రసాదం, నీళ్లు, మజ్జిగ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసింది. అంతేకాదు వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచింది .
ఇదిలా ఉంటే ఈరోజు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష సేవలు జరగనున్నాయి. నేడు స్వామివారికి గరుడ సేవను నిర్వహించనున్నారు. ప్రతినెల పౌర్ణమి రోజు టీటీడీ స్వామి వారికి గరుడసేవను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే నేడు కూడా రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై తిరుమాడ విధులలో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. విశేష పర్వదినాల క్రమంలో స్వామివారి ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో నిండి బయట క్యూ లైన్ లలో కూడా భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని, 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది అని టిటిడి వెల్లడించింది.
అంతేకాదు టైమ్ స్లాట్ ఎస్ఎస్ డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా, స్వామిని దర్శించుకోవడానికి 5 గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉంటే నిన్న స్వామివారిని 80,532 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,438 మంది స్వామివారికి తలనీలాలను సమర్పించారు నిన్న ఒకరోజే శ్రీవారి హుండీ ఆదాయం 3.95 కోట్లుగా వెల్లడించింది టీటీడీ.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications