TTD: మహిళలు అనుకుంటే ఏదైనా చెయ్యగలరు, సదా భార్గవి, వివరాలు తెలుసుకున్న టీటీడీ ఈవో !

తిరుమల/ తిరుపతి: టీటీడీ, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో దేవుళ్ళ చిత్ర పటాలు తయారు చేయడంపై మహిళలకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గురువారం పరిశీలించారు.
టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో దేవుళ్ళ చిత్ర పటాలను తయారు చేయడం హిందూధర్మ ప్రచారానికి ఇదో వాహకం అవుతుందని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి చెప్పారు.
మహిళలు తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి అన్నారు. పేరూరు సమీపంలోని చీని, నిమ్మ పరిశోధన కేంద్రంలో సెప్టెంబరు 28వ తేదీ ఈ శిక్షణ తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఎలా చేస్తారు అని పూర్తి సమాచారం తెలుసుకున్న టీటీడీ ఈవో

ఎలా చేస్తారు అని పూర్తి సమాచారం తెలుసుకున్న టీటీడీ ఈవో

టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలను తీసుకువచ్చి ఎలా ఎండబెడతారు. వాటి రంగు పోకుండా ఎలాంటి సాంకేతికను వాడతారు. పుష్పాలు ఎలా అతికిస్తారు. అనే విషయాలను ఈవో జవహర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. శిక్షణలోని మహిళలు తయారు చేసిన దేవతామూర్తుల చిత్రపటాలు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. మహిళలతో మాట్లాడి వారి అనుభవాలు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలుసుకున్నారు. శిక్షణ సాగుతున్న తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారులకు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పలు సూచనలు చేశారు.

పుష్పాలతో దేవుడి చిత్రపటాలు

పుష్పాలతో దేవుడి చిత్రపటాలు

టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో దేవుళ్ళ చిత్ర పటాలను తయారు చేయడం హిందూధర్మ ప్రచారానికి ఇదో వాహకం అవుతుందని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి చెప్పారు.
పేరూరు సమీపంలోని చీని, నిమ్మ పరిశోధన కేంద్రం లో మూడురోజుల పాటు.మహిళలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం గురువారం ముగిసింది.

ప్రతి ఇంటికి స్వామివారు చేరినట్లే

ప్రతి ఇంటికి స్వామివారు చేరినట్లే

ఈ సందర్భంగా జరిగిన ముగింపు సభకు
టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో దేవుళ్ళ చిత్రపటాలు తయారు చేయడం ద్వారా, ప్రతి ఇంటికి స్వామివారిని పంపుతున్నామని చెప్పారు.

మహిళలు తలచుకుంటే ఏదైనా సాధ్యమే

మహిళలు తలచుకుంటే ఏదైనా సాధ్యమే

మహిళలు తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి అన్నారు. రాబోయే రోజుల్లో టీటీడీ నిర్వహించే మహిళా దినోత్సవ కార్యక్రమం, అవార్డుల ప్రదానం కార్యక్రమాల్లో ఈ ప్రతిమలు ఇస్తామని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి చెప్పారు. శిక్షణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి అభినందనలు తెలిపారు.

వైఎస్ఆర్ విశ్వవిధ్యాలయం వీసీ

వైఎస్ఆర్ విశ్వవిధ్యాలయం వీసీ

డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ జానకిరామ్ వర్చువల్ గా ప్రసంగించారు. టీటీడీ తో చేసుకున్న ఈ ఒప్పందం ఎంతో గొప్పదని డాక్టర్ జానకిరామ్ చెప్పారు. శిక్షణ తీసుకున్న మహిళల్లో భక్తి, శక్తి కనిపించాయని డాక్టర్ జానకిరామ్ అన్నారు. టీటీడీ అగరబత్తులు స్వామివారి ప్రసాదంగా ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలని డాక్టర్ జానకిరామ్ అన్నారు.

Recommended Video

    AP Roads బాగుకై పోరాటం..YSRCP మార్క్ రాజకీయం | Oct 2nd పైనే ఫోకస్ || Oneindia Telugu
    వికలాంగులకు అవకాశం ఇస్తాము

    వికలాంగులకు అవకాశం ఇస్తాము

    చిత్ర పటాల తయారీలో రాబోయే రోజుల్లో వికలాంగులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తామని డాక్టర్ జానకిరామ్ అన్నారు.
    ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసులు, శాస్త్రవేత్తలు డాక్టర్ నాగరాజు, డాక్టర్ కరుణ శ్రీ, టీటీడీ డిప్యూటి ఈవో శ్రీ రమణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+