ఛానళ్ల బ్యాన్‌పై టిడిపి, టి రాష్ట్ర ఉత్సవంగా పీవీ జయంతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ తదితరులు గవర్నర్ నరసింహన్‌ను మంగళవారం కలిశారు. ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై తక్షణమే జోక్యం చేసుకుని పరిశీలించాలని కోరారు.
ప్రసారాలు నిలిపివేయడం అప్రజాస్వామికమని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నారని వారు ఆరోపించారు. కెసిఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయాలంటూ ఎమ్మెస్వోలపై ఒత్తిడి తెస్తున్నారన్నారు.

పీవీ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు
భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పీవీ నరసింహా రావు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రగకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీవీ జయంతి నేపథ్యంలో సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. మరోవైపు హన్మకొండలో పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెరాస నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు తెలిపారు.
కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి: ఎంపీ రాపోలు
కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ మంగళవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడకు లేఖ రాశారు. సూర్యాపేట మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మించాలని లేఖలో పేర్కొన్నారు. కాజీపేటలో రైల్వే వాగన్ వర్క్ షాప్ పనులను వేగవంతం చేయాలన్నారు.












Click it and Unblock the Notifications