రేవంత్ మంచి నాయకుడు, లేకపోవడం నష్టమే, కానీ పార్టీ గొప్పది: టీటీడీపీ నేతల స్పందన
రేవంత్ రెడ్డి రాజీనామా వ్యవహారంపై టీటీడీపీ నేతలు స్పందించారు. రేవంత్ రెడ్డి మంచి నాయకుడని, ఆయన లేకపోవడం పార్టీకి లోటేనని, అయితే వ్యక్తుల కన్నా పార్టీ గొప్పదని వ్యాఖ్యానించారు.
అమరావతి: రేవంత్ రెడ్డి రాజీనామా వ్యవహారంపై టీటీడీపీ నేతలు స్పందించారు. ఏపీ రాజధాని అమరావతిలో టీటీడీపీ నేతలతో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ ముగియగానే వారు బయటికొచ్చారు.
ఈ భేటీ అనంతరం అమరావతిలో మీడియాతో టీటీడీపీ నేతలు ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహులు, సండ్ర, నామా నాగేశ్వర రావు, పెద్ది రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రాజీనామాపై స్పందించారు.

రేవంత్ రెడ్డి మంచి నాయకుడని, ఆయన లేకపోవడం పార్టీకి లోటేనని, అయితే వ్యక్తుల కన్నా పార్టీ గొప్పదని వ్యాఖ్యానించారు. రేవంత్ మర్యాద పూర్వకంగానే పార్టీని వీడినట్లు చెప్పారు.
ఆయన తన రాజీనామా లేఖలో ఎవ్వరిపై ఎటువంటి ఆరోపణలు చేయలేదని టీటీడీపీ నేతలు స్పష్టంచేశారు. తాను వ్యక్తిగతంగా ఎదురైన పలు ఇబ్బందుల కారణంగానే పార్టీని వీడుతున్నాను అని రేవంత్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ఇక ఇందులో అనుకోవడానికి కానీ, చర్చిండానికి కానీ ఏమీ లేదు అని పెద్ది రెడ్డి, సండ్ర వంటి నేతలు మీడియాకు చెప్పారు. చంద్రబాబుతో జరిగిన భేటీలో రేవంత్ రెడ్డి రాజీనామాపై ఏమైనా అంశాలు ప్రస్తావనకొచ్చాయా? అని మీడియా అడిగిన ప్రశ్నకు అటువంటిదేమీ లేదని చెప్పారు.
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ముందు తమతో రేవంత్ మర్యాద పూర్వకంగా మాట్లాడారని అన్నారు. ఆయనపై ఎలాంటి అభియోగాలు లేవని, పార్టీ వీడటం రేవంత్ వ్యక్తిగత నిర్ణయమన్నారు.
-
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
HDFC బ్యాంక్ ప్రతిష్టకు భంగం? వరల్డ్ బ్యాంక్ పదవి కోసమేనా ఈ హైడ్రామా? -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications