అసెంబ్లీ బిల్లుతో అమరావతి పాదయాత్రకు కౌంటర్-ముందస్తు హెచ్చరికలు! జగన్ సర్కార్ వ్యూహమిదే ?

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమరావతి స్దానంలో తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుల్ని గతంలోనే ఉపసంహరించుకుంది. ఆ తర్వాత హైకోర్టు కూడా ఆమరావతే రాజధాని అని తేల్చిచెప్పేసింది. దీనిపై అప్పట్లో సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్తుందని భావించిన వైసీపీ సర్కార్ మౌనంగా ఉండిపోయింది. కేవలం అసెంబ్లీలో చర్చ పెట్టి విమర్శలకు పరిమితమైంది. కానీ ఇప్పుడు అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతితో మొత్తం సీన్ మారిపోయేలా కనిపిస్తోంది.

అమరావతి పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

అమరావతి పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

అమరావతి రైతులు రాజధాని నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్యదేవాలయానికి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు.. నిన్న ఈ పాదయాత్రకు అనుమతి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఎల్లుండి నుంచి అమరావతి మహాపాదయాత్ర 2.0 పేరుతో దీన్ని చేపట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా ప్రభుత్వాన్ని కాదని వరుసగా రెండోసారి పాదయాత్రకు రైతులు తెచ్చుకున్న అనుమతి ఇప్పుడు సర్కార్ కు కంటగింపుగా మారినట్లు కనిపిస్తోంది.

హైకోర్టు అనుమతిపై వైసీపీ ఫైర్

హైకోర్టు అనుమతిపై వైసీపీ ఫైర్

అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. అది రైతుల పాదయాత్ర కాదని విశాఖపై దండయాత్రని మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇందులో శాంతిభద్రతల సమస్య తలెత్తితే చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇదే కోవలో మరో మంత్రి బొత్స కూడా తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేందుకు మూడు రాజధానులు తెస్తోందని, కానీ అమరావతి రైతులు ఓ ప్రాంతం కోసం పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. మిగతా మంత్రులు, నేతలు కూడా ఇదే తరహాలో పాదయాత్రపై విమర్శలకు దిగారు.

 అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు

అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు

అమరావతి పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో స్పందించిన మంత్రులు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ నెల 15 న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలపై అమరావతి పాదయాత్ర ప్రభావం పడకుండా ప్రభుత్వం చూసుకున్నట్లయింది. అసెంబ్లీ సమావేశాల వేళ అమరావతి రైతుల పాదయాత్రలో విపక్ష నేతలంతా కలిసి పాల్గొంటే జనం ఫోకస్ అటే మళ్లుతుంది. కానీ పాదయాత్రలో పాల్గొనేందుకు రాజకీయ నేతలకు అనుమతి లేదు. అయినా ప్రభుత్వం ఎల్లో మీడియాగా భావిస్తున్న టీవీలు, పత్రికల్లో దీనిపై చర్చ జరిగితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం ఖాయం. అందుకే దీన్నుంచి జనం దృష్టి మళ్లించేందుకా అన్నట్లు మూడు రాజధానుల బిల్లును మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోంది.

 జగన్ సర్కార్ ముందస్తు హెచ్చరికలు ?

జగన్ సర్కార్ ముందస్తు హెచ్చరికలు ?

అమరావతికి మద్దతుగా రైతులు పాదయాత్ర చేసుకునేందుకు, అలాగే అసెంబ్లీలో ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు. అయితే మంత్రులు అమరావతి పాదయాత్రకు హైకోర్టు అనుమతిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చేస్తున్న ప్రకటనలు, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందంటూ చేస్తున్న వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ప్రభుత్వం దీనికి ఇస్తున్న ప్రాధాన్యత అర్ధమవుతోంది. అయితే ముందుగానే శాంతి భద్రతల సమస్యను ఊహించి మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు పాదయాత్ర చేసే వారితో పాటు వారికి అండగా ఉంటారని భావిస్తున్న విపక్షాలకు సైతం ముందస్తు హెచ్చరికలుగానే కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+