రాజ్యసభ రేసులో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇతర ఛానల్స్ అధినేతలు...
జనంలో పార్టీ పట్ల స్థిరభిప్రాయం ఉంచేందుకు ఈరోజుల్లో మీడియా పాత్ర చాలా కీలకంగా మారిపోయింది. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ఆయా పార్టీల మైలేజ్ పెంచడానికి, కష్ట కాలంలో ప్రజల్లో పార్టీకి మచ్చ రాకుండా ఉండడానికి మీడియా కృషి చాలానే ఉంటుంది. ఈ విషయంలో ఏపీ అధికార పార్టీ టీడీపీకి మీడియా మద్దతు పుష్కలంగా ఉన్న విషయం తెలిసిందే.
మరి పార్టీల కోసం ఇంత చేసే ఛానెళ్లు.. ఆయా పార్టీల నుంచి ఏం ఆశించవా.. అనే సందేహం తలెత్తొచ్చు. దీనికి సమాధానం దొరికే సమయం ఆసన్నమైనట్టుగానే కనిపిస్తుంది. తాజాగా ఖాళీ అవబోతున్న రాజ్యసభ సీట్లలో టీడీపీకి మూడు సీట్లు దక్కే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయా మీడియా ఛానెళ్ల అధిపతులు టీడీపీ తరుపున రాజ్యసభ రేసు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం.

ఇందులో ప్రముఖ వార్తా చానెళ్ల అధిపతులు.. ఆంధ్రజ్యోతి-రాధాక్రిష్ణ, ఎన్టీవి-నరేంద్ర చౌదరి, టీవి5-నాయుడు రాజ్యసభ సీటు ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో చిత్తూరు జిల్లాకు చెందిన నాయుడు ఇప్పటికే ఓ కేంద్రమంత్రి ద్వారా చంద్రబాబుకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
అయితే పార్టీకి చెందిన ఎక్కువమంది నేతలు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణకే అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారట. చంద్రబాబుకు, రాధాక్రిష్ణకు ఉన్న అనుబంధం అలాంటిది మరి. అయితే సీటు కోసం ప్రయత్నిస్తున్న ఈ మీడియా చానెల్ అధిపతులంతా ఒకే కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. తుది నిర్ణయం పార్టీ అధినేత చంద్రబాబుదే కాబట్టి మరి అధినేత ఎవరిని కరుణిస్తారో వేచి చూడాలి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications