విశాఖ తహసీల్దార్ హత్యకేసులో ట్విస్ట్: నిందితుడు మురారి వెబ్ సీరీస్ విలన్; సేమ్ సీన్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో సంచలనం రేపిన తహసిల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారి సుబ్రహ్మణ్య గంగారావు గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో వెబ్ సిరీస్ లో విలన్ గా యాక్ట్ చేసిన మురారి సుబ్రహ్మణ్య గంగారావు విపరీతమైన హింసతో కూడిన వెబ్ సిరీస్ లో ఏ విధంగా అయితే ఒక క్రైమ్ కి పాల్పడ్డాడో అదేవిధంగా తహసిల్దార్ రమణయ్యను హతమార్చిన అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది.

నిందితుడు మురారి సుబ్రహ్మణ్య గంగారావు మూడేళ్ల క్రితం 'ది నైట్' పేరుతో ఒక వెబ్ సిరీస్ ను చేశాడు. ఈ వెబ్ సిరీస్ కోసం దాదాపు 40 లక్షలకు పైగా ఖర్చు పెట్టాడు. అయితే దర్శకుడికి చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో వెబ్ సిరీస్ ను మధ్యలోనే వదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తానే దర్శకత్వం వహించి, తాను స్వయంగా నటించిన వెబ్ సిరీస్ ను పూర్తి చేశాడు.

Twist in Visakha MRO murder case: Accused Murari is a web series villain!!

అయితే అందులో క్రైమ్ ఎక్కువగా ఉండడంతో ఆ వెబ్ సిరీస్ విడుదలకు కూడా అభ్యంతరాలు వచ్చాయి. ఆ వెబ్ సిరీస్ లో విలన్ పాత్రలో నటించిన మురారి ట్రైలర్ లో యువతి తలపై కొట్టే సీన్ బాగా ప్రమోట్ చేశాడు. సేమ్ అదే తరహాలో తహసిల్దార్ రమణయ్య ను ఇనుప రాడ్ తో తలపై కొట్టి దారుణంగా హతమార్చాడు.

మురారి తహసిల్దార్ రమణయ్య హతమార్చడం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయింది. మధురవాడ లోని జెవెల్ పార్క్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టు స్థలం విషయంలో తహసిల్దార్ తో డీల్ కుదుర్చుకున్న మురారి, ఆ డీల్ నేపథ్యంలోనే తాను చెప్పిన పనిని చేయని తహసిల్దార్ రమణయ్య ను దారుణంగా హతమార్చాడు.

ఆపై మురారి అక్కడ నుండి పరారయ్యారు. నిందితుడు ఏపీ దాటి వెళ్తున్నా పట్టుకోలేకపోయిన పోలీసులు, తాజాగా చెన్నైలో మురారిని పట్టుకుని పీఎం పాలెం పోలీసులు రిమాండ్ కు తరలించారు. భీమిలి కోర్టులో హాజరు పరచగా నిందితుడికి కోర్టు రిమాండ్ విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+