బిజెపి పోలవరం, అమరావతి ట్విస్ట్: చంద్రబాబుకు పక్కా కౌంటర్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి బిజెపి పొమ్మనలేక పొగ పెడుతున్నట్లే కనిపిస్తోంది. పోలవరంపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు మంగళవారం ఇచ్చిన ట్విస్ట్ అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.

  Polavaram Project Pending : Chandrababu Angry on Modi | Oneindia Telugu

  దానికితోడు, చంద్రబాబు ప్రభుత్వం చూపుతన్న లోటుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆయన చెప్పకనే చెప్పారు.

   పోలవరం ట్విస్ట్ ఇలా..

  పోలవరం ట్విస్ట్ ఇలా..

  పోలవరం ప్రాజెక్టును వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేసి ప్రజల మద్దతు పొందాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. అయితే, దానికి బిజెపి ఎసరు పెట్టినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే వివాదాల్లో ఆ విషయం ఉండగా సోము వీర్రాజు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. పోలవరం నిర్మాణానికి వంద శాతం నిధులు కేంద్రమే ఇస్తుందని, అయితే దానికి కాలపరిమితి లేదని ఆయన అన్నారు. చంద్రబాబు కోరిక మేరకు వచ్చే ఎన్నికల నాటికి పూర్తయ్యే విధంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు.

   రాజధాని నిర్మాణంపైనా ఇలా...

  రాజధాని నిర్మాణంపైనా ఇలా...

  తెలంగాణలో సచివాలయాన్ని రూ. 200 కోట్లతోనే నిర్మిస్తున్నారని గుర్తుంచుకోవాలని సోము వీర్రాజు అనడం ద్వారా చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. రాజధాని నిర్మాణంపై అసలు ప్రభుత్వానికి ఓ ప్లాన్ అంటూ ఉందా అని అడిగారు. అసెంబ్లీ హైకోర్టు, రాజభవన్ నిర్మాణాలకు కేంద్రం రూ.1500 కోట్లు కేంద్రం ఇచ్చిందని, రాజధాని ప్రాంత అభివృద్ధికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి నిరుడు వెంకయ్య నాయుడే రూ.1000 కోట్లు ఇచ్చారని సోము వీర్రాజు చెప్పారు.

   రైల్వే జోన్‌కూ బిజెపి కొలికి

  రైల్వే జోన్‌కూ బిజెపి కొలికి

  రైల్వే జోన్‌కు కూడా బిజెపి కొలికి పెడుతోంది. రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టులను కూడా పరిశీలించాలని మాత్రమే విభజన చట్టంలో ఉంది గానీ తప్పనిసరిగా చేయాలని లేదని సోము వీర్రాజు అన్నారు. విడిపోయిన రాష్ట్రాల్లో ఎక్కడా రైల్వే జోన్ లేదని ఆయన చెప్పారు. దీన్ని బట్టి చంద్రబాబును గట్టిగానే ఎదుర్కోవాలని బిజెపి భావిస్తున్నట్లు అర్థమవుతోంది

   అమలుకు కాల పరిమితి చిచ్చు...

  అమలుకు కాల పరిమితి చిచ్చు...

  చంద్రబాబు డిమాండ్లకు తాజాగా బిజెపి మరో వాదనను ముందుకు తెచ్చింది. ఐదేళ్లలో అన్నీ చేయాలని లేదనేది ఆ వాదన. పదేళ్ల గడువు ఉన్నా కూడా వేగంగా అభివృద్ధి చేస్తున్న కేంద్రాన్ని నిందిస్తారా అని సోము వీర్రాజు అడిగారు. ఎపి కన్నా యుపి చాలా వెనకబడి ఉందనే లాజిక్‌ను కూడా ఆయన తీశారు.

  అసలు లెక్కలేవీ...

  అసలు లెక్కలేవీ...

  డబ్బులు దేనికి ఖర్చు చేశారో చెప్పకకుండా ఏమీ ఇవ్వలేదని మాట్లడడాన్ని బిజెపి తప్పు పడుతోంది. అసలు ఆంధ్రప్రదేశ్ లోటు కేవలం రూ.4600 కోట్లు మాత్రమేనని సోము వీర్రాజు తేల్చేశారు. రుణమాఫీ, సంక్షేమ పథకాలు కలిపి రూ.16 వేల కోట్లుగా చంద్రబాబు ప్రభుత్వం చూపిస్తోందని ఆయన మండిపడ్డారు. అన్నీ లెక్కేసిలోట బడ్జెట్ అంటేఎలా అని ఆయన అడిగారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  BJP is in a plan counter Andhra Pradesh CM and Telugu Desa party chief Nara Chnadrababbu Naidu on Polavaram.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి