టెక్కీల మృతిలో ట్విస్ట్: అమెరికాకి వెళ్లేందుకు అడ్డు అని

ప్రమాదం జరిగినప్పుడు సుదీప్ కారు నడిపినట్లుగా సోమదీప్ తెలిపారు. అయితే, సుదీప్ కారు నడిపాడని సోమదీప్ కేసును పక్కదోవ పట్టించినట్లుగా పోలీసులు గుర్తించారు. అమెరికా వెళ్లేందుకు ఇబ్బందులు వస్తాయనే కేసును పక్కదోవ పట్టించాడు. ప్రస్తుతం సోమదీప్ పరారీలో ఉన్నాడు. అతని కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
కాగా, కెపిహెచ్‌బి కాలనీలో ప్రగతినగర్‌లో శనివారం తెల్లవారు జామున సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ఆ ఘటనలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మరణించారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను సుదీప్, ఉటియాలుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో వారిద్దరు ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు కారు ప్రమాదానికి సోమదీప్ అని గుర్తించారు.












Click it and Unblock the Notifications