విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యోగా మాస్టర్ హత్య కేసులో ట్విస్ట్: అతనిపై హత్యాయత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: యోగా మాస్టర్ పొలమరశెట్టి వెంకటరమణ హత్య కేసు మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉ్న జనగోగల పత్రిక సంపాదకుడు కిలపర్తి వెంకటరమణపై హత్యాయత్నం జరిగింది.

<strong>కుమారుడి కోసం యోగా మాస్టర్‌ను చంపించిన జర్నలిస్టు </strong>కుమారుడి కోసం యోగా మాస్టర్‌ను చంపించిన జర్నలిస్టు

విశాఖపట్నంలోని బర్మా కాలనీలో ఫైర్ స్టేషన్ పక్కన శనివారం అర్థరాత్రి నలుగురు వ్యక్తులు అతనిపై ఇనుపరాడ్లతో మూకుమ్మడిగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో స్పృహ తప్పి రోడడుపై పడి ఉన్న అతనని ఆదివారం తెల్లవారు జామున కొంత మంది గుర్తించారు.

 ఆరోగ్య పరిస్థితి నిలకడగానే...

ఆరోగ్య పరిస్థితి నిలకడగానే...

కొంత మంది వ్యక్తులు 108కి సమాచారం ఇవ్వడంతో వెంకటరమణను కెజిహెచ్‌‌కు తరలించారు. అయితే, ఆ సంఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కిలపర్తి వెంకటరమణపై నిజంగానే దాడి జరిగిందా, యోగా మాస్టర్ హత్య కేసులో పోలీసుల దృష్టి మళ్లించే ప్రయత్నంలో ఇది జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సుపారీ విషయంలో గొడవ జరిగిందా...

సుపారీ విషయంలో గొడవ జరిగిందా...

యోగా మాస్టర్ హత్యకు అంగీకరించిన సుపారీ నిందితులకు ఇచ్చే సమయంలో ఏదైనా గొడవ జరిగి ఆ సంఘటన జరిగిందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నయి. ఈ అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 యోగా మాస్టర్ హత్య కేసులో సుపారీ..

యోగా మాస్టర్ హత్య కేసులో సుపారీ..

యోగా మాస్టర్ హత్య కేసులో ఆరుగురికి సుపారి ఇస్తానని జర్నలిస్టు వెంకటరమణ చెప్పినట్లు సమాచారం. అంగీకరించిన మేరకు సుపారీ ఇవ్వకపోవడంతో ఘర్షణ తలెత్తినట్లు కూడా భావిస్తున్నారు.

 ఆధారాలను బట్టి ఇలా..

ఆధారాలను బట్టి ఇలా..

విశాఖపట్నంలోని నేతాజీనగర్‌కు చెందిన యోగా మాస్టర్ పొలమశెట్టి వెంకటరమణను పాస్పోర్టు కార్యాలయం సమీపంలో కొంత మంది వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడి చేసి శుక్రవారం రాత్రి హత్య చేసిన విషయం తెలిసిందే. ఘటనా స్థలంలో దొరికిన కొన్ని ఆధారాలను బట్టి జనగోల పత్రిక సంపాదకుడు కిలపర్తి వెంకటరమణను ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

 అతని కోసం గాలింపు చేపట్టారు...

అతని కోసం గాలింపు చేపట్టారు...

కిలపర్తి వెంకటరమణ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అతనిపై దాడి జరిగింది. యోగా మాస్టర్ర హత్యకు కిలపర్తి వెంకటరమణ ఆరురుగు వ్యక్తులకు రూ.1.50 లక్షల సుపారి ఇచ్చేందుకు ఒప్పంందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

 ఆ తర్వాత విడిపోయారు..

ఆ తర్వాత విడిపోయారు..

యోగా మాస్టర్ హత్య తర్వాత వెంకటరమణతో పాటు నిందితులంతా రెండు గ్రూపులుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో తిరిగారు. శనివారం రాత్రి ఇరవర్గాలు విశాఖపట్నంలోని బర్మా కాలనీలో ఓ చోట కలిసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో గొడవ జరిగి కిలపర్తి వెంకటరమణపై హత్యాయత్నానికి దారి తీసినట్లు తెలుస్తోంది.

 అందువల్లనే అలా...

అందువల్లనే అలా...

సుపారీ మొత్తం ఎక్కువ ఇవ్వాలని మిగతా ఆరుగురు నిందితులు పట్టుబట్టడంతో వెంకటరమణ అంగీకరించలేదని, దాంతో అతనిపై వారు దాడి చేశారని అంటున్నారు. చనిపోయాడని భావించారో లేదా అటు వెపు ఎవరైనా రావడం వల్ల పారిపోయారో తెలియదని అంటున్నారు.

 నాటకానికి తెర తీశాడా..

నాటకానికి తెర తీశాడా..

అయితే తన కోసం పోలీసులు గాలిస్తుండడంతో జర్నలిస్టు వెంకటరమణ నాటకానికి తెర తీశాడనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నయాయి. చేతులకు, కాళ్లకు మాత్రమే గాయాలు కావడం వల్ల ఆ అనుమానం తలెత్తుతోంది. కిలపర్తి వెంకటరమణ ఇచ్చిన వాంగ్మూలం మేరకు బర్మా క్యాంపునకు చెందిన యువకులు యోగా మాస్టర్ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

English summary
In twist to Yoga master murder case the main suspect Kilaparthi Venkataramana has been attacked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X