అగ్రిగోల్డ్ కేసులో దర్యాప్తు ముమ్మరం : మరో ఇద్దరు డైరెక్టర్ల అరెస్ట్
అగ్రిగోల్డ్ కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. అగ్రిగోల్డ్ డైరెక్టర్లు శ్రీనివాస్, రామ్మోహన్ రావును శనివారం అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఇద్దరు డైరెక్టర్లతో సహా 9 మందిని అరెస్ట్
విజయవాడ: అగ్రిగోల్డ్ కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. అగ్రిగోల్డ్ డైరెక్టర్లు శ్రీనివాస్, రామ్మోహన్ రావును శనివారం అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఇద్దరు డైరెక్టర్లతో సహా 9 మందిని అరెస్ట్ చేశారు.
శనివారం సాయంత్రం ఏలూరు కోర్టుకు పోలీసులు ఈ నిందితులను తరలించనున్నారు. త్వరలోనే మరో 10 మంది డైరెక్టర్లను అరెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా ఏపీ సీఐడీ వర్గాలు వెల్లడించాయి.

కాగా, తెలంగాణలో కూడా అగ్రిగోల్డ్ కేసుపై అక్కడి సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. తెలంగాణలో కూడా అగ్రిగోల్డ్ బాధితులు ఉండటం, అగ్రిగోల్డ్ కార్యాలయాలు, భారీగా ఆస్తులు ఉండటంతో తెలంగాణ సీఐడీ విచారణను ముమ్మరం చేసింది. అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications