నగల కోసం కిడ్నాపైన అమ్మాయిలు వీరే (పిక్చర్స్)
హైదరాబాద్: బంగారు నగల కోసం అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను గుర్తు తెలియని వ్యక్తులు సికింద్రాబాదులోని అల్వాల్ ఇందిరానగర్ నుండి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారి వద్ద ఉన్న బంగారు చెవి దిద్దులు లాక్కోని బోయిన్‌పల్లిలో వదిలేసి వెళ్లిన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది.
స్థానికుల కథనం ప్రకారం - ఇందిరానగర్‌లో నివాసం ఉన్న యువరాజు, విజయల కూతురు ప్రియ, వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సురీ భాగ్య కుమార్తె శ్రీలత స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. శ్రీలత 1వ తరగతి కాగా ప్రియ 2వ తరగతి చదువుతోంది. ప్రతి రోజు లాగానే ఇద్దరు ఇందిరానగర్‌లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఆల్వాల్ పోలీసులు వచ్చి చిన్నారులను తీసుకుని వెళ్లారు. అంతకు ముందు చిన్నారుల తల్లి తండ్రులు అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే బోయిన్‌పల్లిలో ఉన్న చిన్నారులను పోలీసులు వారి తల్లి తండ్రులకు అప్పగించారు.

కిడ్నాపైన అమ్మాయిలు...
సికింద్రాబాదులోని ఆల్వాల్‌లో గల ఇందిరా నగర్ నుంచి అపహరణకు గురైన ఇద్దరు చిన్నారుల ప్రియ, శ్రీలత

నగలు లాక్కొన్నారు..
సోమవారం సాయంత్రం గుర్తుతెలియని ఇద్దరు మహిళలు విద్యార్థుల వద్దకు వెళ్లి ఇద్దరిని తీసుకోని బోయిన్‌పల్లికి తీసుకువచ్చి వారి చెవికి ఉన్న బంగారు దిద్దులు తీసుకోని వదిలివెళ్లారు.

పోలీసులకు సమాచారం
దొంగలు తమను వదిలివెళ్లడంతో చిన్నారులు ఏడ్వటంతో ఇరుగు పోరుగు చేరుకొని వివరాలు తెలుసుకొని అల్వాల్ పోలీసులకు సమాచారం అందించారు. అపహరణకు గురైన ప్రియ ఇలా..

సాయంత్రం సుఖాంతం
సాయంత్రం 4 గంటల పాటు సాగిన కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకోని కిడ్నాపర్ల కోసం దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి శ్రీలత ఇలా...
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications