విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నకిలీ పిహెచ్‌డిలతో పట్టుబడిన ఇద్దరు లెక్చరర్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: నకిలీ పిహెచ్‌డీలతో ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు కాలేజీ లెక్చరర్లు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖకు పట్టుబడ్డారు. ఒకతను ఎస్ఆర్ఆర్ కాలేజీలో పనిచేస్తుండగా మరొకతను మొవ్వ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నాడు.

మగధ విశ్వవిద్యాలయం నుంచి వారిద్దరు నకిలీ పిహెచ్‌డీలు పొందారు. వాటితో 2013 ఎపిపిఎస్‌సీ ద్వారా జూనియర్ లెక్చరర్లుగా ఎంపికయ్యారు. కళాశాల విద్యా శాఖ విచారణ జరపగా అవి నకిలీ సర్టిఫికెట్లు అని తేలింది.

Two college lecturers caught with fake PhDs

లంచం ఇచ్చి వాటిని తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ అధికారులు మగధ విశ్వవిద్యాలయం అధికారులను సంప్రదించి సర్టిఫికెట్లను పరిశీలించారు. దాంతో ఆ సర్టిఫికెట్లు నకిలీవని తేలింది.

తదుపరి చర్యయ కోసం విషయాన్ని ప్రభుత్వానికి నివేదించినట్లు విజయవాడ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్అధికారి ఎం రవీంద్రనాథ్ బాబు చెప్పారు. ఇద్దరు లెక్చరర్లలో ఎం. రజనీకాంత్ అనే అతను కృష్ణా జిల్లా మొవ్వలోని ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తు్నాడు.

English summary
The Vigilance and Enforcement department busted a fake degree racket caught two lecturers possessing fake Ph.Ds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X