విశాఖ: గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం..!

విశాఖపట్నం: జిల్లాలోని జోడుగళ్లపాలెం దగ్గర బీచ్‌లో ముగ్గురు యువకులు గురువారం గల్లంతైన సంగతి తెలిసిందే. గల్లంతైన వారిలో ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం ఉదయం తీరానికి రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. గల్లంతైన మరొకరి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ఎండ వేడిమి భరించ లేక గురువారం ఉదయం బాలాజీ నగర్, అన్నానగర్‌కు చెందిన 10 మందిలో ఆటోలో బయలుదేరి సముద్రతీరానికి చేరుకున్నారు. రెప్ప మూసి తెరిచేలోగా ఈతకు దిగిన ముగ్గురు యువకులను రాకాసి అల లాగేసింది. ఒకరిని రక్షించడానికి మరొకరు వరుసగా వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.

Two dead body found in missing off Vizag beach

అరిలోవకు చెందిన లోకేష్‌‌, రాజు, విజయ్‌లుగా పోలీసులు గుర్తించారు. ముందుగా లోకేశ్ నీటిలోకి దిగాడు. లోపలికి వెళ్లకముందే పెద్ద కెరటం అతడిని లాక్కునిపోయింది. అతడిని రక్షించడానికి విజయ్, రాజు ఊపిరాడక మునిగిపోతూ కేకలు వేశారు. ఇది గమనించిన మత్యకారులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు.

అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో సాధ్యం కాలేదు. గల్లంతైన ముగ్గురి యువకల ఆచూకీ కోసం గురువారం రాత్రి వరకూ తెలియరాలేదు. లోకేశ్ ఎసి మెకానిక్‌గా చేస్తుండగా, విజయం పెయిటంగ్ పనులకు, రాజు ఆటో డ్రైవర్‌గా పనులు చేసకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+