కర్నూల్లో రాజకీయ ఆధిపత్యం: భాషా హత్యకు ప్రతీకారం, కాంగ్రెస్ కార్యకర్త నరికివేత
కర్నూలు: జిల్లాలోని ప్యామిలి మండలం మునిమడుగు గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయ హత్యలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో, మునిమడుగు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాగూర్ భాషాను ప్రత్యర్థులు హత్య చేశారు. ప్రతీకార చర్యగా ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంబగిరి స్వామిని నరికేశారు. పోలీసుల భద్రతా వలయాన్ని చేధించుకొని వెళ్లి భాషా హత్యకు ప్రతీకారం తీసుకున్నారని తెలుస్తోంది.
గంటల వ్యవధిలోనే ఇద్దరి హత్య గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగిందని చెబుతున్నారు.

గ్రామంలో గంటల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులు ఫ్యాక్షన్ రాజకీయాలకు బలయ్యారు. ఇది గ్రామంలో అందరిని భయకంపితులకు గురి చేస్తోంది. ఉదయం టిడిపి నేత హత్య, ఆ తర్వాత కాంగ్రెస్ నేత ప్రతీకార హత్యతో గ్రామం ఉడికిపోతోంది. కత్తులు, రాళ్లు, రాడ్లతో పరస్పరం దాడికి దిగారు. రాజకీయ ఆధిపత్య పోరులో ఇద్దరు బలయ్యారు. ఇరువర్గాల పరస్పర దాడిలో పలువురు గాయపడ్డారు.
కాకినాడలో నలుగురు ఉపాధ్యాయులపై హెల్మెట్‌తో దాడి
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని సిబిసిఎన్సీ పాఠశాల వద్ద ఘర్షణ జరిగింది. నలుగురు ఉపాధ్యాయుల పైన ఓ మహిళా టీచర్ భర్త, కుమారుడు హెల్మెట్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. స్కూలుకు ఆలస్యంగా వస్తున్నారని నిలదీశారనే ఈ దాడి చేశారని తెలుస్తోంది.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications