మళ్లీ కరోనా పంజా, ఇద్దరు మృతి - కొత్త వేరియంట్లు..ఇక తప్పనిసరి..!!
దేశంలో మళ్లీ కొవిడ్-19 కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కరోనా కారణంగా శనివారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. రెండు కొత్త వేరియంట్లను గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చా యి. దీంతో, ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.
పెరుగుతున్న కేసులు
కోవిడ్ మరోసారి విస్తరిస్తోంది. ఒకే రోజు ఇద్దరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్-19 తో మహారాష్ట్రలోని ఠాణెలో 21 ఏళ్ల యువకుడు మృతి చెందగా, బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు శనివారం ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన ఇద్దరికీ ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీలో కరోనా కేసులు ఎక్కువ గా నమోదవుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 18 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఉత్తరా ఖండ్ లోనూ కరోనా కేసులు రెండు నమోదైనట్లు అధికారులు తెలిపారు. చార్ధామ్ యాత్ర సంద ర్భంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇక మే నెలలో ఇప్పటివరకు ఒక్క కేరళలో అత్యధికంగా 273 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి.

తెలుగు రాష్ట్రాల్లో
ఇక, ఢిల్లీలో 23 మందికి కరోనా సోకింది. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కేసులు, తెలంగాణలో 1 కేసు నమోదయ్యాయి. అయితే, క్రియాశీలకంగా ఉన్న కేసుల్లో రోగుల పరిస్థితి సాధారణంగా ఉందని అధికారులు చెబుతున్నారు. అందరూ ఇంటి దగ్గరే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సమీక్షించారు. చాలా కేసుల్లో తీవ్రత అంతగా లేదని అధికారులు చెబుతున్నారు. కొత్తగా నమోదు అవుతున్న కేసుల్లో ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్.7 అనే రెండు కొత్త కొవిడ్ సబ్ వేరియంట్లను భారత్‌లో గుర్తించామని ఇండియన్ సార్స్ కరోనా వైరస్-2 జీనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) వెల్లడించింది. ఎన్‌బీ.1.8.1 కొవిడ్ సబ్ వేరియంట్‌కు చెందిన ఒక కేసు ఏప్రిల్‌లో తమిళనాడులో బయటపడగా, ఎల్‌ఎఫ్.7 కొవిడ్ సబ్ వేరియంట్‌కు చెందిన నాలుగు కేసులు మేలో గుజరాత్‌లో నమోదైనట్లు ఇన్సాకాగ్ తెలిపింది.
మార్గదర్శకాలు
చైనా సహా ఆసియాలోని పలుదేశాల్లో కరోనా కేసులు పెరగడానికి ఈ సబ్ వేరియంట్లే కారణమవుతు న్నాయని పేర్కొంది. కడపలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. నంద్యాల జిల్లా చాగల మర్రికి చెందిన 75 ఏళ్ల మహిళ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం కడప రిమ్స్‌లో చేరింది. వృద్ ధురాలికి తీవ్ర జ్వరం ఉండటంతో అనుమానించిన వైద్యులు గత రాత్రి కరోనా పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు కరోనా సోకినట్లు రిమ్స్ వైద్యులు తేల్చారు. వృద్ధురాలికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ఇప్పటికే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్ తలపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్కులు కచ్చితంగా వాడాలని పేర్కొంది. రైల్వేస్టేషన్లు , బస్టాండ్లు విమానాశ్రయాలు వంటి వాటిలో కోవిడ్ నిబంధనలు పాటించాలని ఏపీ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications