మరో గర్ల్ ప్రేమలో ప్రియుడు, అతనికోసం ఇంకో యువతి
చిత్తూరు: ఓ ముక్కోణపు ప్రేమ ఇరువురి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగింది. ఓ యువతి యువకుడిని ప్రేమించింది. అతను మాత్రం మరో అమ్మాయిని ప్రేమించాడు. తాను ప్రేమిస్తున్న యువకుడు మరో యువతిని ప్రేమిస్తున్నాడని తెలిసినప్పటికీ మొదటి అమ్మాయి అతని కోసం ఇంటి నుండి వచ్చింది.
తనను పెళ్లి చేసుకోవాలని వెంటపడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తమ అమ్మాయిని కిడ్నాప్ చేశారని ప్రియుడి పైన ఫిర్యాదు చేయాలని భావించారు. ఇది తెలియడంతో అతను... ఆ అమ్మాయిని ఇంటివద్ద దింపేందుకు బయలుదేరాడు. రైల్వే స్టేషన్‌లో దిగగానే వారికి ఎదురుగా అమ్మాయి కుటుంబ సభ్యులు కనిపించారు.

ఆ సమయంలో ఏం చేయాలో తోచని వారు రైలు పట్టాల పైకి దూకారు. ఆ సమయంలో వచ్చిన రైలు ఢీకొట్టడంతో... యువతి గాయపడింది. ప్రియుడికి కాళ్లు విరిగిపోయాయి. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
హఫీజ్‌పేటలో అక్రమ కట్టడాల కూల్చివేత
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్‌పేట సర్వే నెం.80లో అక్రమకట్టడాలను బుధవారం ఉదయం అధికారులు కూల్చివేశారు. కూల్చివేతను ఆపేందుకు టౌన్‌ప్లానింగ్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. కూల్చివేతలను నిలిపివేయాలని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కార్పొరేటర్ నీలం రవీందర్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications