వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ బాధలు భరించలేం: కలెక్టరేట్ల ఎదుట ఇద్దరి ఆత్మహత్యాయత్నం

|
Google Oneindia TeluguNews

ప్రకాశం/పశ్చిమగోదావరి: అప్పులిచ్చిన వారి నుంచి బాధలు భరించలేక కలెక్టరేట్‌ల వద్ద ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయ. ఈ రెండు ఆత్మహత్యాయత్నాలు స్థానికంగా కలకలం సృష్టించాయి.

తాడేపల్లిగూడెంనకు చెందిన అచ్యుత నాగరాజు వడ్రంగి పనిచేస్తుంటాడు. కొంతకాలం క్రితం ఇతను హైదరాబాద్‌కు చెందిన మాధవీలత అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2014లో వారిద్దరూ నిడదవోలు మండలం ఆట్లపాడు గ్రామానికి వచ్చి స్ధిరపడ్డారు. అదే గ్రామంలో 68 గజాల స్థలం కొనుగోలుచేసి, ఇల్లు నిర్మించుకున్నారు.

ఇంటి నిర్మాణం నిమిత్తం ఒకరి వద్ద రూ.2.5 లక్షలు, మరొకరి వద్ద రూ.90వేలు, మరొకరి వద్ద రూ.50 వేలు అప్పుతీసుకున్నారు. తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లిస్తున్నారు. కొద్దికాలం క్రితం నాగరాజు ఇంటి మెట్లు దిగుతూ ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. శస్తచ్రికిత్స జరగడంతో పనిలోకి వెళ్లడంలేదు. దీంతో కొంతకాలంగా అప్పులకు వడ్డీ చెల్లించడంలేదు.

కాగా, వెంటనే అప్పు చెల్లించకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని అప్పు ఇచ్చినవాళ్లు బెదిరిస్తూ వచ్చారని మాధవీలత చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. తమకు న్యాయం చేయాలంటూ మీ కోసం కార్యక్రమంలో రెండుసార్లు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

Two persons attempted suicide in AP

అనంతరం 2016 జూలై 21న ఒక పోలీసు అధికారి వద్ద సెటిల్‌మెంట్ జరిగి 15రోజుల్లో సొమ్ము చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. గత ఆగస్టు 5వ తేదీతో గడువు ముగియనుండటంతో డబ్బులు లేక నాగరాజు, మాధవీలత గ్రామం విడిచి వెళ్లిపోయారు. దీంతో ఆగస్టు 11వ తేదీన తాళాలు పగులగొట్టిన బాకీదారులు ఇంటిని స్వాధీనం చేసుకున్నారని మాధవీలత వెల్లడించారు.

ఈ నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో మీకోసం కార్యక్రమానికి మరోసారి వచ్చి ఫిర్యాదు చేయగా కలెక్టరు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి చెప్పారని తెలిపింది.
మరోసారి మీ కోసంలో ఫిర్యాదు చేయడానికి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు మాధవీలత దంపతులు.

కాగా, సమావేశమందిరం వద్దకు చేరుకునే సమయంలోనే నాగరాజు ఒక్కసారి తన వెంట తెచ్చుకున్న చెదల నివారణ మందు తాగేశాడు. దీనిని గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా నాగరాజు వద్ద సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో అతడు కోలుకుంటున్నాడు. తమకు న్యాయం చేయాలని మాధవీలత ఈ సందర్భంగా వేడుకున్నారు.

ప్రకాశంలో..

ఇది ఇలా ఉండగా, ప్రకాశం జిల్లా ఘటనలో వడ్డీ వేధింపుల నేపథ్యంలో ఒక యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సోమవారం 'మీ కోసం' ప్రజావిజ్ఞప్తుల దినం సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఒంగోలు రైలుపేటకు చెందిన గొడ్డేటి నరేష్‌ సోమవారం మధ్యాహ్నం గ్రీవెన్స్‌సెల్‌లో వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చి వరుసలో నిలుచున్నాడు.

అప్పటికే పురుగుమందు తాగి ఉన్నందున కాసేపటికే అతడు కుప్పకూలిపోయాడు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది వెంటనే స్పందించారు. రెండో పట్టణ ఎస్సై వేమన బాధితుడు నరేష్‌ను రక్షక్‌ వాహనంలో హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు.

బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక రైలుపేటకు చెందిన నరేష్‌ స్థానికంగా నివసించే చింతపల్లి పార్వతి వద్ద రూ.1.60 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అసలుకు రెండింతలు తిరిగి చెల్లించినా రుణదాత తీవ్రంగా వేధిస్తున్నారనీ, ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారనేది బాధితుడి ఆరోపణ.. గత సోమవారం జరిగిన గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేశామని, ఈ విషయం బయటకు పొక్కటంతో రుణదాత తమను మరింతగా వేధిస్తున్నామని నరేష్‌ సోదరి ఆరోపించారు.

తమ తండ్రి చనిపోయారని, అప్పుల వాళ్ల వేధింపులు తట్టుకోలేక తమ తల్లి గుండెపోటుతో బాధపడుతున్నారని వివరించారు. బాధితుడు ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న నరేష్‌ను ఒంగోలు ఆర్‌డీఓ కె.శ్రీనివాసరావు, రెండో పట్టణ సీఐ పి.దేవప్రభాకర్‌ పరామర్శించారు. ఈ ఉదంతంపై విచారణ జరుపుతామని సీఐ చెప్పారు.

English summary
Two persons allegedly attempted suicide in Andhra Pradesh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X