ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్లు.. 8 మందికి తీవ్రగాయాలు
అమరావతి: విశాఖ జిల్లా పరవాడలోని ఫార్మా కంపెనీలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. రెండు రియాక్టర్లు పేలిపోవడంతో ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రమాదంపై కార్మికుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Recommended Video

Mumbai Fire Reasons : ముంబై కమలా మిల్స్ ప్రమాదానికి కారణాలు : మత్తు, సెల్ఫీ, నిర్లక్ష్యమే
ఫార్మా కంపెనీల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications