• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం హోదాలోనే ఢిల్లీలో దీక్ష : రెండు ప్ర‌త్యేక రైళ్లు : జాతీయ నేత‌ల‌కు ఆహ్వానం..!

|

ఎన్నిక‌ల వేళ‌..చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి హోదా లో ఢిల్లీలో దీక్ష‌కు సిద్ద‌మ‌య్యారు. ఏపి భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో సీయం ఈ నెల 11న ఉద‌యం 8 గంట‌ల నుండి రాత్రి 8గంట‌ల వ‌ర‌కు దీక్ష చేయాల‌ని నిర్ణియంచారు. ఇందు కోసం ఏపి నుం డి రెండు ప్ర‌త్యేక రైళ్లు ఏర్పాటు చేసారు. ఈ నెల 12 రాష్ట్రప‌తిని క‌లిసి విన‌తి ప‌త్రం స‌మ‌ర్పిస్తారు.

సీయం హోదాలో తొలిసారిగా..

ఏపి ముఖ్య‌మంత్రి చంద్రబాబు త‌న అధికారిక హోదాలోనే ఢిల్లీలో దీక్ష చేయాల‌ని నిర్ణ‌యించారు. ముఖ్య‌మంత్రి గా దీక్ష చేస్తేనే జాతీయ స్థాయిలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌గ‌లుగుతామ‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. దీక్ష కోసం ఏర్పా టు చేసిన ప్ర‌త్యేక మంత్రుల క‌మిటీతో సీయం స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌ధానంగా ఏపీకి ఇచ్చిన హామీల అమలులో కేం ద్రం వైఫల్యాన్ని ఎత్తిచూపడానికి సీయం హోదాలోనే దీక్ష స‌రైన‌ద‌ని నిర్ణ‌యించారు.

Two Special Trains for Delhi : Inviting National leaders for Babu Deekhsa..

దేశ రాజధానిలో దీక్ష చేయడం వల్ల కేంద్రం ఈ రాష్ట్రం పట్ల అనుసరించిన వైఖరిని జాతీయస్థాయిలో ఎండగట్టడానికి, మోదీ ప్రభుత్వ సంకుచిత వైఖరిని చాటడానికి అనువుగా ఉంటుందని అభిప్రాయ ప‌డ్డారు. ఒక రాష్ట్ర సీఎం దేశ రాజధానిలో దీక్ష చేయడం ప్రభావవంతంగా ఉంటుందన్న అంచనాకు వ‌చ్చారు. దీంతో.. దీక్షకు అవసరమై న ఏర్పాట్లపై నేతలు దృష్టి పెట్టారు. మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉద్యమ సంఘా లు, ఉద్యోగ సంఘాలు తదితరులందరినీ ఆహ్వానిస్తున్నారు.

రెండు ప్ర‌త్యేక రైళ్లు ఏర్పాటు..

కిందిస్థాయిలోని వారిని కూడా దీక్షలో పాలు పంచుకొనేలా రాష్ట్రం నుంచి 2 ప్రత్యేక రైళ్లు వేయాలని నిర్ణయించారు. ఒక రైలు ఉత్తరాంధ్ర నుంచి మరో రైలు రాయలసీమ నుంచి బయలుదేరుతుంది. ఒక్కో జిల్లాకు ఒకటి లేదా రెండు బోగీలు కేటాయించాలని, సుమారుగా 1500 మంది వరకూ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఢిల్లీలోని తెలుగు సంఘాల ద్వారా రెండు మూడు వేల మందిని స్థానికంగా సమీకరించగలమని టీడీ పీ ఎంపీలు సూచించారు.

Two Special Trains for Delhi : Inviting National leaders for Babu Deekhsa..

కానీ, రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ప్రాతినిథ్యం ఉంటే, ఉద్యమ భాగస్వామ్యం అందరికీ లభించినట్లవుతుందన్న ఉద్దేశంతో ప్రత్యేక రైళ్లను వేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వారి సొంత ఖర్చులతో విమానంలో ఢిల్లీ రావాలని సూచించారు. ప్రత్యేక రైళ్లు ఈ నెల 8వ తేదీ రాత్రి రాష్ట్రం నుంచి బయలుదేరుతాయి. 10వ తేదీ రాత్రి అక్కడకు చేరతాయి. తిరిగి 11వ తేదీ రాత్రి అక్కడ నుంచి బయలుదేరి 13వ తేదీ రాత్రి ఇక్కడకు వస్తాయి. ఒక రోజు దీక్ష తర్వాత 12న ఇదే అంశంపై రాష్ట్రపతిని కలవాలని సీఎం నిర్ణయించారు సీఎం దీక్షకు భావసారూప్యం ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నారు. దీని ద్వారా జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారుతుం ద‌ని అంచ‌నా వేస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Chandra Babu Dharma Deeskha on 11th of this month in Delhi At AP Bhavan. Two special trains arranged for party volunteers who attending form various parts of AP. Tdp Mp's also inviting national leaders for CM Deeskha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more