తల్లిదండ్రులకు కడుపుకోత: ప్రేమనుకుని పాఠశాల విద్యార్థుల ఆత్మహత్య

తూర్పుగోదావరి: తెలిసీతెలియని వయస్సులోనే ఆకర్షణలకు లోనైన ఇద్దరు పాఠశాల విద్యార్థులు.. అదే ప్రేమానుకున్నారు. తమ ప్రేమను పెద్దలు కాదంటారేమోనని భయంతో తమ ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కాకినాడ హీరినో బ్లూవింగ్‌ బర్ట్స్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న అభిషేక్‌ జైన్‌ (16), గాయత్రికాగ్‌ (16) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న స్కూల్‌ యాజమాన్యం తల్లిదండ్రుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళతామని మందలించినట్టు తెలిసింది.

అప్పటికే ఈ విషయాన్ని అభిషేక్‌ తల్లిదండ్రులుకు చెప్పారని, ఇరు కుటుంబాలు రాజస్థాన్‌కు చెందినవారు కావడంవల్ల సర్దుబాటు చేసుకోమని స్కూల్‌యాజమాన్యం సూచించినట్టు తెలిసింది. అయితే , ఈ విషయం గాయత్రి తల్లిదండ్రులకు తెలియలేదు.

Two students committed suicide for their love

పదో తరగతి పరీక్షలకు ప్రిపేరవుతున్న వీరు శుక్రవారం ఉదయం స్కూల్‌కు అని బయలుదేరి ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో అభిషేక్‌ తండ్రి అరవింద్‌ జైన్‌, గాయత్రి తండ్రి ఓంప్రకాష్‌ వారిద్దరూ కనిపించడం లేదని కాకినాడ వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేస్తూ బంధువులకు వాట్సాప్‌ ద్వారా ఫొటోలు పంపారు.

ఇంతలో భయపడిన ఆ యువతీయువకులు రాజమహేంద్రవరం చేరుకుని తమ ప్రేమను సాధించుకునే ధైర్యం, వయసు చాలకపోవడంతో క్షణికావేశంలో రోడ్‌ కం రైలు బ్రిడ్జిపైకి ఎక్కి 5వ స్తంభం నుంచి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

ఇది గమనించిన మత్స్యకారులు వారిని వెలికితీసేలోగా ప్రాణాలు వదిలారు. సమాచారం అందుకున్న టూటౌన్‌ పోలీసులు.. వారి మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించి వీరిని గుర్తించేందుకు చర్యలు చేపపట్టారు.

కాగా, కాకినాడ నుంచి అభిషేక్‌ తండ్రి అరవింద్‌, గాయత్రి తండ్రి కాగ్‌జైన్‌, కుటుంబసభ్యులు రాజమహేంద్రవరంలో ఆత్మహత్య చేసుకుంది తమ పిల్లలని తెలుసుకొని శనివారం స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాలను చూసిన వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాకినాడ పట్నాల వారి వీధికి చెందిన ఓం ప్రకాష్‌కాగ్‌ టీవీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.

తిలక్‌వారి వీధికి చెందిన అభిషేక్‌ తండ్రి అరవింద్‌ జైన్‌ కాకినాడ షిప్‌ యార్డులో పనిచేస్తున్నాడు. వీరిద్దరు రాజస్థాన్‌కు చెందినవారే. ఏడున్నర ఏళ్ల క్రితం కాకినాడకు వచ్చి స్థిరపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శనివారం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో అభిషేక్‌, గాయత్రి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి అనంతరం వారి బంధువులకు అప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+