ప్రమాదంలో టెక్కీల మృతి: టెక్కీ ఇంటి వద్ద భార్య ధర్నా
హైదరాబాద్/కర్నూలు: కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు సాఫ్టువేర్ ఇంజనీర్లు మృతి చెందారు. కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన సుదీప్, ఉటియాలు హైటెక్ సిటీలో వేర్వేరు కంపెనీల్లో సాఫ్టువేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు.
సుదీప్ కొండాపూర్‌లో, ఉటియా బాచుపల్లిలో ఉంటున్నారు. కోల్‌కతాకే చెందిన మరో ఇద్దరు కొండాపూర్‌లో ఉంటూ మాదాపూర్‌లోని ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు నలుగురు శనివారం రాత్రి బాచుపల్లలోని మరో స్నేహితుడి ఇంటికి వెళ్లారు. రాత్రి అక్కడ పార్టీ చేసుకొని శనివారం తెల్లవారుజామున కారులో బయలుదేరారు.

వేగంగా కారు నడిపిన సుదీప్ ప్రగతి నగర్ సమీపంలోకి రాగానే రోడ్డు పక్కనే ఉన్న చెట్టును డీకొట్టడంతో మృతి చెందాడు. అతనితో పాటు ముందు సీట్లో కూర్చున్న ఉటియా కూడా మృతి చెందాడు. వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
భర్త ఇంటి ముందు భార్య ధర్నా
ప్రేమించి, పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని ఆ తర్వాత మొహం చాటేసిన భర్త కోసం హైదరాబాదుకు చెందిన యువతి రాజమండ్రిలో భర్త ఇంటి ముందు శనివారం దీక్షకు దిగింది. భానుచంద్ర అనే వ్యక్తి సాఫ్టువేర్ ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. రంజితతో పరిచయం ఏర్పడింది. గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. జనవరిలో రాజమండ్రికి వెళ్లిన టెక్కీ భర్త తిరిగి రాలేదు. ఫోన్ పని చేయలేదు. దీంతో రంజిత రాజమండ్రిలో భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. నిందితులు పరారీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications