Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ ఏజెన్సీలో తుపాకీల మోత; ఏఓబీలో ఎన్‌కౌంటర్, ఇద్దరు మహిళా మావోలతో సహా ముగ్గురు మృతి

ఆంధ్ర ఒడిశా సరిహద్దు తుపాకీ మోతలతో దద్దరిల్లింది. గత కొద్దిరోజులుగా ఆంధ్రా ఒడిశా సరిహద్దు బోర్డర్లో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా, విశాఖ ఏజెన్సీ సరిహద్దు గ్రామం తులసి పాడు ప్రాంతంలో మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. ఇంకా పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.

ఎన్ కౌంటర్ లో ఇద్దరు మహిళా మావోలతో పాటు ముగ్గురు మావోయిస్ట్ ల మృతి

ఎన్ కౌంటర్ లో ఇద్దరు మహిళా మావోలతో పాటు ముగ్గురు మావోయిస్ట్ ల మృతి

మల్కన్ గిరి జిల్లాలోని మథిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసి పాడు అటవీ ప్రాంతంలో మంగళవారం మావోయిస్టులకు మరియు భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా క్యాడర్‌లతో సహా మరో వ్యక్తి కనీసం ముగ్గురు సభ్యులు మరణించారు.ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి గురించి నిఘా వర్గాల సమాచారం మేరకు, ఒడిశా పోలీసులు మరియు మల్కన్ గిరి జిల్లా వాలంటరీ ఫోర్స్ (డివిఎఫ్) నుండి ఒక ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఓజి) సంయుక్త బృందం ఈ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టింది.

 ఇంకా కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్ .. ఘటనా స్థలం నుండి రెండు తుపాకులు స్వాధీనం

ఇంకా కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్ .. ఘటనా స్థలం నుండి రెండు తుపాకులు స్వాధీనం

ఆపరేషన్ సమయంలో, అడవిలో ఉన్న ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. తదనంతరం, జవాన్లు ప్రతీకారం తీర్చుకున్నారు. హోరా హోరీగా సాగిన ఎదురు కాల్పులలో ముగ్గురు మావోయిస్టులకు బుల్లెట్ గాయాలయ్యాయని అక్కడికక్కడే మరణించారు అని పోలీసులు చెప్పారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలను ఘటనా స్థలంలో గుర్తించామని వెల్లడించారు. ఈ కాల్పుల్లో మరింత మంది మావోయిస్టులు మరణించే అవకాశం లేకపోలేదు. కాల్పుల్ల్లో కొందరు గాయపడినట్లు భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. నివేదికల ప్రకారం, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుండి రెండు తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నారు.

గతేడాది 16 మంది మావోలను మట్టుబెట్టిన ఒడిశా భద్రతా దళాలు

గతేడాది 16 మంది మావోలను మట్టుబెట్టిన ఒడిశా భద్రతా దళాలు

చివరి నివేదిక వచ్చే వరకు భద్రతా దళాల కూంబింగ్ మరియు సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగనున్నాయి. గత ఏడాది ప్రారంభంలో, ఒడిశాలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో నిషేధిత సిపిఐ (మావోయిస్టు) కు చెందిన 16 మంది సభ్యులు మరణించారు. ఏడుగురు పౌరులు, ఇద్దరు పోలీసులు కూడా ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోని విశాఖపట్నం సరిహద్దు అటవీ ప్రాంతంలోనూ పోలీసులు గాలింపు చేపట్టారు. గత కొంతకాలంగా మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు మావోయిస్టుల ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయటానికి పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు.

సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న ఎన్ కౌంటర్లు

సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న ఎన్ కౌంటర్లు

ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పులు సరిహద్దు గ్రామాలలో ఆందోళనకు కారణంగా మారాయి. గత కొద్ది రోజులుగా మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలు పోలీసుల ముందు లొంగిపోవడం, మరి కొందరు కీలక నేతలను అరెస్టు చేయడంతో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ తగిలింది. ఇక ఇదే సమయంలో మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఇటీవలే ఒడిశా రాష్ట్రంలోని మల్కన్ గిరి జిల్లా తులసిపాడు అటవీప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఒక్కసారిగా కాల్పులు జరుపుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.

మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల సమయంలో ఇదే ప్రాంతంలో ఎదురు కాల్పులు

మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల సమయంలో ఇదే ప్రాంతంలో ఎదురు కాల్పులు

ఈ క్రమంలో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులకు అందిన సమాచారంతోనే డివిఎఫ్, ఎస్ఓజి బలగాలు రంగంలోకి దిగి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. సెప్టెంబర్ 21 నుంచి 27వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ ఉత్సవాల సమయంలో ఈ ఘటన జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+