• search
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇద్దరు తండ్రులు:పిల్లల్ని చంపాడు...తాను బ్రతికిపోయాడు;తాను చనిపోయాడు...పిల్లలు తప్పించుకున్నారు

|

కర్నూలు/ఒంగోలు:రాష్ట్రంలో ఆదివారం నాడు ఇద్దరు తండ్రులు చేసిన పని సర్వత్రా చర్చనీయాంశగా మారింది. కర్నూలు జిల్లాలో ఒక తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకొని ఇంట్లోనుంచి వెళ్లిపోయిన భార్య మీద కోపంతో అభం శుభం తెలియని చిన్నారులను దారుణంగా హతమార్చాడు.

మరో తండ్రేమో కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న భార్య కారణంగా తాను అవమానం పాలవుతున్నానంటూ...అందుకోసం తన ఇద్దరు పిల్లల్ని చంపి తాను కూడా చనిపోవాలనుకున్నాడు. పిల్నల్ని కారులో నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి ముందుగా తాను పురుగుల మందు తాగిన ఆ తండ్రి ఆ తరువాత పిల్లల్ని టవల్ తో ఉరేసి చంపాలని ప్రయత్నించాడు. అయితే పిల్లలు తప్పించుకోవడంతో బ్రతికిపోయారు. అయితే ఆ పిల్లలు రాత్రంతా అదే కారులో తండ్రి శవం పక్కనే ఉండాల్సిరావడం కడు విషాదం. వివరాల్లోకి వెళితే...

 Two worse fathers:One father killed the children...another father was dead,children safe

కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా గ్రామానికి చెందిన భానోజీరావు అనే వ్యక్తికి ఝాన్సీలక్ష్మీబాయి అనే యువతితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి లిఖిత(7), మధు(4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ఝాన్సీ భర్త, పిల్లలను వదిలేసి వేరొక వ్యక్తితో వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భానూజీరావు సోమవారం తెల్లవారుజామున బ్లేడ్‌తో చిన్నారులను గొంతుకోసి హత్య చేశాడు.

అనంతరం భానూజీరావు ఇంట్లోనే తాడుతో ఉరేసుకున్నాడు. అయితే తాడు తెగిపోవడంతో కింద పడిపోయాడు. ఆ తరువాత ఏమి ఆలోచించాడో ఏంటో...వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి లొంగిపోయాడు. ఈ మేరకు ఎస్సై అశోక్‌ కుమార్‌, సీఐ మధుసూదన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో సింగరాయకొండ మండలం శానంపూడికి చెందిన కె.నాగరాజు(32)కు, కందుకూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన వీణాకుమారికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. బేల్దారీ మేస్త్రిగా పనిచేస్తున్న నాగరాజు కుటుంబ సమేతంగా హైదరాబాద్‌లోని హఫీజ్‌పేటలో ఉంటున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో గత నెల 28న వీణాకుమారి హఫీజ్‌పేటలో బలవన్మరణం చెందింది. ఆమె అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామం వచ్చిన నాగరాజు భార్య మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.

అంతకంటే ముందే తన ఇద్దరు బిడ్డలనూ చంపాలనుకున్నాడు. శనివారం రాత్రి కారులో ఇద్దరు పిల్లలు రఘునందన్‌, సహస్రలను తీసుకొని కందుకూరు మండలంలోని పలుకూరు అడ్డరోడ్డు సమీపంలో శానంపూడి పొలాల్లోకి వెళ్లే దారిలో కారును తీసుకొచ్చాడు. అక్కడ తనతో తెచ్చుకున్న పురుగులమందు తాగాడు.
ఈ క్రమంలో పిల్లలను చంపేందుకు టవల్‌తో వారి గొంతులకు ఉరేసి లాగటంతో వారు భయపడి పెనుగులాడి కారులో నుంచి దూకేసి దూరంగా వెళ్లారు. ఆ తరువాత కారు దగ్గరికి తిరిగొచ్చిన వీరికి తండ్రి నిద్రపోయినట్లు పడివుండటంతో వీళ్లు కూడా కారులోకి ఎక్కి పడుకున్నారు.

ఆదివారం ఉదయాన్నే నిద్ర లేచిన పిల్లలు తండ్రిని ఎంత లేపినా లేవకపోవటంతో భయంతో రహదారిపైకి వచ్చి అటుగా వెళుతున్న వారి సహాయంతో బంధువులకు విషయం చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. శవపరీక్ష అనంతరం బంధువులకు మృతదేహం అప్పగించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన చిన్నారులు అనాథలైపోయారని బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

మరిన్ని కర్నూలు వార్తలుView All

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kurnool/Ongole:Two fathers have committed atrocity over children created sensation in Andhra Pradesh state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more