6 నెలలుగా...మైనర్ బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం:గృహిణిపై దాడి
ఒంగోలు:దేశంలో కీచకులు చెలరేగిపోతున్నారు. చిన్నాపెద్దా తేడాలేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. నిందితులపై చర్యల గురించి ప్రభుత్వాలు ఎంత ఊదరగొడుతున్నా కామాంధుల్లో ఇసుమంతైనా మార్పు కనపడటం లేదు.
తాజాగా ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం నీలకంఠాపురంలో మరో దారుణం వెలుగుచూసింది. మైనర్ బాలికను మాయమాటలు చెప్పో...భయపెట్టో ఆరు నెలలుగా ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. అయితే అనుకోకుండా ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు విషయం తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది.

మరోవైపు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక గృహిణిపై ముగ్గురు యువకులు అత్యాచార యత్నానికి ప్రయత్నించటమే కాకుండా ప్రతిఘటించిన ఆమెపై బీరు సీసాతో దాడిచేసి గాయపరచిన సంఘటన చోటుచేసుకుంది. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధారంగానగర్ కు చెందిన వివాహిత బహిర్భూమి వెళుతుండటం గమనించిన ఇప్పటం, గుండిమెడ గ్రామాలకు చెందిన ప్రసాద్, సందీప్, మరో యువకుడు ఆమెని అనుసరించి పట్టుకొని పొదల్లోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు.
అప్పటికే మద్యం మత్తులో ఉన్న వీరు ఆమె తమని అడ్డుకోవడంతో ఆగ్రహించి ఆమెపై తమవద్ద ఉన్న బీరుసీసాతో దాడి చేశారు. దీంతో వివాహిత పెద్దగా కేకలు వేయటంతో పరిసర ప్రాంతంలోని మహిళలు వచ్చి అడ్డుకోబోయారు. అయితే ఈ యువకులు వారిపైనా దాడికి దిగారు. అప్పటికే అక్కడకు చేరుకున్న స్థానికులు వీరిలో ఇద్దరు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications